Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

ఇరాన్‌తో యుధ్ధం.. అత్యంత వినాశనకరం.. ఇమ్రాన్ ఖాన్

war with iran will be disastrous saus pakistan pm imran khan, ఇరాన్‌తో యుధ్ధం.. అత్యంత వినాశనకరం.. ఇమ్రాన్ ఖాన్

ఇరాన్‌తో యుధ్ధంవల్ల తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్పష్టం చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరైన ఆయన ట్రంప్‌తో భేటీ అయినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇరాన్-అమెరికా మధ్య సాయుధ పోరాటమే జరిగితే అది ప్రపంచ దేశాలకు డిజాస్టర్ అవుతుందని, పేదరికానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అది ఎంతకాలం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేరు.. నా అభిప్రాయం ప్రకారం పెను వినాశనానికి కారణమవుతుంది అని ఇమ్రాన్ పేర్కొన్నారు. ట్రంప్ మీతో ఏకీభవించారా అన్న ప్రశ్నకు ఆయన.. ట్రంప్ మౌనం వహించారని, అయితే తన ఉద్దేశం ఆయనకు అర్థమైందని తెలిపారు. ఆఫ్ఘన్ సమస్య ఇంకా పరిష్కారం కావలసి ఉందని, యుధ్ధమే మొదలైతే.. ఇరాన్ అంశం మరో పెద్ద సమస్య అవుతుందని అన్నారు. సైనిక పరమైన విభేదాలను యుధ్ధం ద్వారా ఆయా దేశాలు ఎందుకు పరిష్కరించుకోవాలనుకుంటున్నాయో తనకు అర్థం కావడంలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు.

కాగా-ఇమ్రాన్‌తో భేటీ అయినఅనంతరం మాట్లాడిన ట్రంప్.. కాశ్మీర్ సమస్యపై భారత-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన పరిణామాలను తాను నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు. అవసరమైతే మీ వివాదాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి తను రెడీ అని ఇదివరకు పాడిన పాటనే ట్రంప్ మళ్ళీ ‘ పాడారు’. భారత-పాకిస్థాన్ దేశాల మధ్య విభేదాలు తమకు పెద్ద సమస్య అని పేర్కొన్న ఆయన.. ఉద్రిక్తతలను నివారించేందుకు తమ దేశం ఎప్పుడూ సిధ్ధంగా ఉంటుందని చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో ట్రంప్ ఇండియాను సందర్శించే అవకాశాలున్నాయి.

 

Related Tags