వివేకా హత్యపై జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం

విజయవాడ: ఎన్నికల ప్రచారంలో జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడుకే రక్షణలేని ఈ పాలనలో ప్రజలకు ఏ ఒక్కరికైనా రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి సొంత చిన్నాన్నను హత్య చేయించి, ఆ నేరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీద నెట్టేందుకు పోలీసులు, అధికారులు, ఎల్లో మీడియాను వాడుతున్న ఈ వ్యవస్థలో ఏ ఒక్కరికైనా రక్షణ ఉంటుందా? ఒక్కసారి చంద్రబాబు పాలన, కుట్రలను చూడండి అని జగన్ అన్నారు. […]

వివేకా హత్యపై జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం
Follow us

|

Updated on: Mar 29, 2019 | 7:48 PM

విజయవాడ: ఎన్నికల ప్రచారంలో జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడుకే రక్షణలేని ఈ పాలనలో ప్రజలకు ఏ ఒక్కరికైనా రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి సొంత చిన్నాన్నను హత్య చేయించి, ఆ నేరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీద నెట్టేందుకు పోలీసులు, అధికారులు, ఎల్లో మీడియాను వాడుతున్న ఈ వ్యవస్థలో ఏ ఒక్కరికైనా రక్షణ ఉంటుందా? ఒక్కసారి చంద్రబాబు పాలన, కుట్రలను చూడండి అని జగన్ అన్నారు. విశాఖ విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం చేసి, చేసిన ఒక గంటలోపే డీజీపీ వచ్చి ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోండని జగన్ అన్నారు.

ఇందుకు చంద్రబాబు కౌంటరిచ్చారు. వివేకాను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అన్నారు. సాయంత్రం ఒక లెటర్ ఇచ్చారని, డ్రైవర్‌ను తొందరగా రమ్మన్నందుకు తనను చంపేబోతున్నాడని, చంపేముందు లెటర్ రాయించారని చంద్రబాబు అన్నారు. తర్వాత భార్య, కుమార్తెను చేతల్లో పెట్టుకుని వేరేవాళ్లు చంపారని నాటకాలు ఆడుతున్నారని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని చంద్రబాబు ఆరోపించారు. బండారం భయపడుతుందని భయపడుతున్నారని, చిన్నాన్న చంపే పరిస్థితిలో రాష్ట్రానికి రక్షణ ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడికత్తి కేసుకు రాద్దాంతం చేశారని, కేంద్ర ప్రభుత్వం దీనికి ఎంక్వైయిరీ వేశారని విమర్శించారు.