సరిహద్దులో యుద్ధం.. స్వయంగా రంగంలోకి దిగిన మోడీ!

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయం బయటకొచ్చిన వెంటనే పాకిస్థాన్ తిప్పి కొట్టామని ఖండించగా భారత ఆర్మీ నిదానంగా దాడిని దృవీకరించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా భారత ఆర్మీ అధికారులు, వాయిసేన […]

సరిహద్దులో యుద్ధం.. స్వయంగా రంగంలోకి దిగిన మోడీ!
Follow us

|

Updated on: Feb 26, 2019 | 10:42 AM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయం బయటకొచ్చిన వెంటనే పాకిస్థాన్ తిప్పి కొట్టామని ఖండించగా భారత ఆర్మీ నిదానంగా దాడిని దృవీకరించింది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా భారత ఆర్మీ అధికారులు, వాయిసేన అధికారులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. తదుపరి జరగాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారని తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర కీలక జాతీయ నేతలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో కీలక వ్యూహాలు రూపొందుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా భారత జవాన్లు కన్నుమూసిన వెంటనే ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదులు చాలా పెద్ద తప్పు చేశారని, ఖచ్చితంగా బదులు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీకి పూర్తి స్థాయి స్వేచ్ఛను కూడా ఆయన ప్రకటించారు. దీంతో దాడి జరిగిన ఫిబ్రవరి 14 నుంచి నేటి వరకు భారత్-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..