Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

హలో ..మీ వంటింట్లో ఉప్పు ఉందా?

Want to save your kidneys Eat less salt, హలో ..మీ వంటింట్లో ఉప్పు ఉందా?

ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? ఇదేం ప్రశ్న అనుకోకండి. ఉప్పు లేకపోతే వంటలు ఎలా చేసుకోగలుతాం? నిజమే.. వంటల్లో రుచికోసం ఉపయోగించే ఉప్పు.. ఒక రకమైన విషపదార్ధమని మీకు తెలుసా?
అవును ఇది నిజం. ఎందుకంటే ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్టే. ఉప్పును అధికంగా ఉపయోగిస్తే కలిగే నష్టాలేమిటో ఇది చదివితే మీకే తెలుస్తుంది.
చిన్న వయస్సులోనే మూత్రపిండాల వ్యాధులు ఏటికేడాది పెరుగుతున్నాయి. డయాలసిస్ చేయించుకునే వారిలో 25 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం కిడ్నీ వైఫల్యం. దేశంలో సంభవించే మరణాల్లో ఐదు ప్రధాన కారణాల్లో కిడ్నీ వైఫల్యం ఒకటని నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ సమస్యను నివారించడం ఎలా? దీనికి చేయాల్సింది పెద్దగా ఏమీలేదు. మన వంటింట్లోనే దీనికి పరిష్కారం ఉంది. వంటల్లో రుచికోసం ఉపయోగించే ఉప్పును తగ్గిస్తే కిడ్నీలను కాపాడుకున్నట్టే అంటున్నారు వైద్యులు.

మూత్రపిండాలు వైఫల్యం చెందడానికి ఒక కారణం బీపీ. ఉప్పు అధికంగా వినియోగించడానికి.. శరీరంలో బీపీ పెరగడానికి మధ్య లింక్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం రక్తపోటుకు దారితీయవచ్చు, కానీ దీనికి విరుద్ధంగా, మీరు రక్తపోటును నియంత్రించగలిగితే, ఖచ్చితంగా కిడ్నీలు పాడవకుండా ఉంటాయంటున్నారు.

నోటికి రుచిగా ఉన్నాయి కదా అని ఊరగాయలు, పచ్చళ్లు, నామ్కీన్స్ (వేయించిన స్నాక్స్) వంటి ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది కాదంటున్నారు. వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఉప్పు శాతాన్ని తగ్గించి తింటే మందులు కూడా బాగా పనిచేస్తాయి. ఉప్పును తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్ళమవుతాం.
ముఖ్యంగా వండిన పదార్ధాలపై ఉప్పును చల్లుకుని తినే అలవాటు కొన్ని ప్రాంతాల వారికి ఉంది. దీంతో మరీ ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయి. తినే ఆహార పదార్ధాల్లో ఉప్పును తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం ద్వారా కిడ్నీ సమస్యలతో పాటు ప్రాణాపాయకర పరిస్థితులనుంచి కూడా కాపాడుకోవచ్చు.