Breaking News
  • విజయనగరం: కొత్తవలస మండలం అప్పనపాలెంలో రోడ్డుప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అమరావతి: రేపు టీడీఎల్పీ సమావేశం. మంగళగిరి టీడీపీ కార్యాయలంలో ఉ.10:30కి సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.
  • ఢిల్లీ: నిర్భయ కేసు. న్యాయవాది ఏపీ సింగ్‌కు బార్‌ కౌన్సిల్‌ నోటీసులు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. న్యాయవాది ఏపీ సింగ్‌పై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్.
  • నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు-ఉత్తమ్‌. 40 లక్షల మంది ఎస్సీలకు కేబినెట్‌లో మంత్రి పదవి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు షాక్‌ తప్పదు-ఉత్తమ్‌కుమార్‌.
  • ఓయూ అసిస్టెంట్‌ ప్రొ.కాశిం ఇంటిపై పోలీసుల దాడిని ఖండించిన సీపీఐ. కాశిం ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం-చాడ వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాశిం ఇంట్లో సోదాలను వెంటనే నిలిపివేయాలి-చాడ వెంకట్‌రెడ్డి.

నో చిన్న సినిమాలు.. ఓన్లీ బిగ్ ఫిలిమ్స్!

Director Maruthi Birthday Special Interview, నో చిన్న సినిమాలు.. ఓన్లీ బిగ్ ఫిలిమ్స్!

‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు మారుతి. ఈ చిత్రం తర్వాత వరుసగా చిన్న సినిమాలు తీసి బంపర్ హిట్స్ కొడుతూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. మారుతి తన సొంత నిర్మాణ సంస్థ మారుతి టాకీస్‌పై పలు చిత్రాలు నిర్మించి ప్రొడ్యూసర్‌గా కూడా సక్సెస్‌ సాధించాడు. అటు నిర్మాతగా.. ఇటు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్న మారుతి ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతి రోజూ పండుగే’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

‘ప్రతి రోజూ పండుగే’ చిత్రం పూర్తిగా కుటుంబ కథాంశంతో తెరకెక్కుతోంది. మనం ప్రతి చిన్న మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. అలాంటిది జీవితంలో ఆఖరి వేడుకైన చావును కూడా ఎందుకు సెలబ్రెట్ చేసుకోకూడదు.? వయసు పైబడుతున్న వారికి బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని మారుతి తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి కథాంశం రాలేదని.. ప్రేక్షకులకు ఇది తప్పకుండా కనెక్ట్ అవుతుందని ఆయన అన్నారు.

అంతేకాక తన బ్యానర్‌లో చిన్న సినిమాలను నిర్మించడం ఆపేశానని మారుతి వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న చిన్న సినిమాలన్నీ యువతను టార్గెట్ చేయడం కోసం వల్గారిటీని ఎక్కువగా జొప్పిస్తున్నారని.. తాను కూడా తొలినాళ్లలో డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టానని.. అయితే ఇప్పుడు అవి సినిమాను ఏమాత్రం నడిపించవని ఆయన తెలిపారు.

భవిష్యత్తులో పెద్ద సినిమాలు మాత్రమే చేస్తానని.. జీఏ2, యూవీ బ్యానర్లతో కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నట్లు మారుతి తన మనసులోని మాటను వెల్లడించారు. కాగా, ‘మహానుభావుడు’ హిందీ రీమేక్ చర్చలు జరుగుతున్నాయని.. దానికి తానే దర్శకత్వం వహించవచ్చని ఆయన అన్నారు.