వాట్సాప్ యూజర్లకు రిలీఫ్

సోషల్‌ మీడియా వేదిక వాట్సాప్ ద్వారా వేధింపులను ఎదుర్కొంటున్న బాధితులకు ఊరట. వాట్సాప్‌లో వేధింపులపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డాట్‌) కల్పించింది. అశ్లీల, అభ్యంతరకరమైన సందేశాలను, లేదా కంటెంట్‌ను షేర్‌ చేసే వారికి చెక్‌ చెప్పేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బాధితులు తమకు ఫిర్యాదు చేయవచ్చని శుక్రవారం సంబంధిత అధికారి ప్రకటించారు. ప్రమాదకరమైన, బెదిరింపు, అసభ్యమైన వాట్సాప్‌ సందేశాలను అందుకున్న బాధితులు ఎవరైనా ccaddn-dot@nic.in కు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు […]

వాట్సాప్ యూజర్లకు రిలీఫ్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:45 PM

సోషల్‌ మీడియా వేదిక వాట్సాప్ ద్వారా వేధింపులను ఎదుర్కొంటున్న బాధితులకు ఊరట. వాట్సాప్‌లో వేధింపులపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డాట్‌) కల్పించింది. అశ్లీల, అభ్యంతరకరమైన సందేశాలను, లేదా కంటెంట్‌ను షేర్‌ చేసే వారికి చెక్‌ చెప్పేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బాధితులు తమకు ఫిర్యాదు చేయవచ్చని శుక్రవారం సంబంధిత అధికారి ప్రకటించారు.

ప్రమాదకరమైన, బెదిరింపు, అసభ్యమైన వాట్సాప్‌ సందేశాలను అందుకున్న బాధితులు ఎవరైనా ccaddn-dot@nic.in కు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని డాట్‌ కంట్రోలర్‌ ఆశిష్‌ జోషి ట్వీట్‌ చేశారు. అయితే ఇందుకు అలాంటి సందేశాల స్క్రీన్‌ షాటన్లు అంది​చాల్సి వుంటుందని పేర్కొన్నారు.