తుపాకుల అమ్మకాలపై వాల్‌మార్ట్ కీలక నిర్ణయం

గన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ రీటైలర్ సంస్థ వాల్‌మార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 7:44 am, Fri, 30 October 20

గన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ రీటైలర్ సంస్థ వాల్‌మార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై.. తుపాకులు, తూటాలు, మందుగుండు సామాగ్రి విషయంలో వాల్‌మార్ట్ స్టోర్స్ నుంచి తీసివేయాలని డిసైడ్ అయ్యింది. అమెరికాలో వాల్‌మార్ట్ స్టోర్లలో ఇక నుంచి తుపాకులు, తూటాలను బహిరంగంగా ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యాప్తంగా 4,700 రీటైల్ స్టోర్స్ ను నిర్వహిస్తోంది వాల్‌మార్ట్. తమ దుకాణాల్లో సగం స్టోర్లలో వాల్‌మార్ట్ తుపాకులను విక్రయిస్తోంది. తుపాకుల వల్ల నేర ప్రవృత్తి పెరిగి, అశాంతి నెలకొంటున్న నేపథ్యంలో తుపాకులను ఇక స్టోరులో ప్రదర్శించరాదని నిర్ణయించింది. ఖాతాదారుల భద్రత కోసం తుపాకులు, తూటాలను ప్రదర్శన నుంచి తరలించామని వాల్‌మార్ట్ ఈమెయిల్ సందేశంలో పేర్కొంది. వాల్‌మార్ట్ గత సంవత్సరం చేతి తుపాకులు, షార్ట్ బారెల్ రైఫిల్, మందుగుండు సామాగ్రి విక్రయాలను నిలిపివేసింది. జార్జ్ ప్లాయిడ్ ను పోలీసులు హతమార్చిన నేపథ్యంలో వాల్‌మార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.