బరువు తగ్గాలని వాకింగ్ చేస్తున్న వారికి..బ్యాడ్‌న్యూస్..!! ఇలా చేయకపోతే అంతే సంగతులు..

బరువు తగ్గేందుకు అంతా ఈజీగా చేసే పని ఏంటంటే వాకింగ్. ఎందుకంటే వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారన్న అభిప్రాయం. అంతేకాదు.. మన వైద్యులు కూడా అదే సలహా ఇస్తారు. దీంతో అంతా బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నవారే కాక.. బాడీ కంట్రోల్ చేసుకుందామని అనుకునే వారంతా.. నిత్యం వాకింగ్ చేయడం ఓ నిత్యకృత్యంగా చేసుకుంటున్నారు. అయితే వీరందరికీ అమెరికాలోని బ్రిగ్‌హమ్ యంగ్ యూనివర్సిటీ షాకింగ్ న్యూస్ చెప్పింది. నిత్యం వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం కాక.. […]

బరువు తగ్గాలని వాకింగ్ చేస్తున్న వారికి..బ్యాడ్‌న్యూస్..!! ఇలా చేయకపోతే అంతే సంగతులు..
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 4:51 AM

బరువు తగ్గేందుకు అంతా ఈజీగా చేసే పని ఏంటంటే వాకింగ్. ఎందుకంటే వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారన్న అభిప్రాయం. అంతేకాదు.. మన వైద్యులు కూడా అదే సలహా ఇస్తారు. దీంతో అంతా బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నవారే కాక.. బాడీ కంట్రోల్ చేసుకుందామని అనుకునే వారంతా.. నిత్యం వాకింగ్ చేయడం ఓ నిత్యకృత్యంగా చేసుకుంటున్నారు. అయితే వీరందరికీ అమెరికాలోని బ్రిగ్‌హమ్ యంగ్ యూనివర్సిటీ షాకింగ్ న్యూస్ చెప్పింది. నిత్యం వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం కాక.. పెరుగుతారని సంచలన విషయాన్ని వెల్లడించింది.

ఇందుకోసం ఈ యూనివర్శిటీకి చెందిన 120 మంది యువకులపై ఓ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అధ్యయనం కోసం యువకులంతా పెడోమీటర్లు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన విధించారు. వీటి ద్వారా వారు రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నారనే వివరాలను యూనివర్సిటీ  సేకరించింది.

24 వారాల తర్వాత సదరు యువకుల నడకలకు సంబంధించిన గణాంకాలను.. శరీర బరువుల్లో వచ్చిన తేడాలను గమనించారు. అయితే ఇందులో రోజూ 15 వేల అడుగులు నడిచిన వారి బరువు కూడా.. సగటున 1.5 కేజీలు పెరిగినట్లు గుర్తించారు. సో దీన్నిబట్టి శరీర బరువు తగ్గించుకోవాలంటే.. నడక ఒక్కటే సరిపోదని.. ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి పలు ఇతరత్రా అంశాలు కూడా కీలకమైనవేననే నిర్ధారణకు వచ్చారు.