హీరోగా మాస్ డైరక్టర్.. ‘సీనయ్య’ ఏ మాత్రం మెప్పిస్తాడో..!

ఒక హీరోలోని హీరోయిజాన్ని చూపించాలంటే టాలీవుడ్‌లో మొదటగా గుర్తొచ్చే దర్శకుడి పేరు వివి వినాయక్. చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, బన్నీ, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన ఈ దర్శకుడు.. వారికి మంచి విజయాలను అందించాడు. అయితే గతేడాది సాయి ధరమ్‌తో తీసిన ఇంటిలిజెంట్ మూవీ తరువాత ఈ దర్శకుడు సినిమాలకు దూరమయ్యారు. ఆ క్రమంలోనే ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. ఇన్ని రోజులు అందరినీ డైరక్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు మరో దర్శకుడి […]

హీరోగా మాస్ డైరక్టర్.. 'సీనయ్య' ఏ మాత్రం మెప్పిస్తాడో..!
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2019 | 6:06 PM

ఒక హీరోలోని హీరోయిజాన్ని చూపించాలంటే టాలీవుడ్‌లో మొదటగా గుర్తొచ్చే దర్శకుడి పేరు వివి వినాయక్. చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, బన్నీ, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన ఈ దర్శకుడు.. వారికి మంచి విజయాలను అందించాడు. అయితే గతేడాది సాయి ధరమ్‌తో తీసిన ఇంటిలిజెంట్ మూవీ తరువాత ఈ దర్శకుడు సినిమాలకు దూరమయ్యారు. ఆ క్రమంలోనే ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. ఇన్ని రోజులు అందరినీ డైరక్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు మరో దర్శకుడి డైరక్షన్‌లో నటించబోతున్నాడు. ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహా.. వివి వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించడం మరో విశేషం. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

దసరా సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. అందులో మాస్ లుక్‌లో కాస్త మెగాస్టార్ చిరును గుర్తు చేశారు వినాయక్. ఇక వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సీనయ్య షూటింగ్‌‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాఘవేంద్ర రావు, సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు వినాయక్‌పై మొదటి క్లాప్‌ను కొట్టాడు. కాగా 15 ఏళ్ల క్రితం దిల్ సినిమాతో దిల్ రాజుకు వినాయక్ లైఫ్ ఇవ్వగా.. ఇప్పుడు దిల్ రాజు, వినాయక్‌ను హీరోగా పరిచయం చేస్తుండటం గమనించదగ్గ విషయం.

అయితే ఆది సినిమా ద్వారా టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయిన వివి వినాయక్.. ఠాగూర్, చెన్న కేశవ రెడ్డి, దిల్, బన్నీ, లక్ష్మీ, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్.150 వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా చిరు, బాలకృష్ణ, ఎన్టీఆర్, బన్నీ, చెర్రీ, రవితేజలకు గుర్తుండిపోయే హిట్లను ఇచ్చాడు. అయితే నటించడం కూడా వినాయక్‌కు కొత్తేం కాదు. తాను దర్శకత్వం వహించిన ఠాగూర్, ఖైదీ నంబర్.150, అదుర్స్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో ఆయన మెరిశాడు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా రాబోతున్నాడు. మరి ఈ మాస్ డైరక్టర్‌ను నరసింహా ఎలా చూపబోతున్నాడు..? హీరోగా ప్రేక్షకులను వినాయక్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.