Breaking News
  • డా.వసంత్‌కు డీఎంహెచ్‌వోలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు. గాంధీలో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ వసంత్‌. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన వసంత్‌.
  • మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు. తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన. మంత్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
  • రేపు ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిని రద్దు చేయొద్దంటూ ఢిల్లీ పెద్దలను కలవనున్న ఎమ్మెల్సీలు. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎమ్మెల్సీలు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న టీడీపీ బృందం.
  • సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • బెంగాల్‌ సర్కార్ సంచలన నిర్ణయం. ఎన్నికల వ్యూహకర్త పీకేకు జెడ్‌కేటగిరీ భద్రత. తృణమూల్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే.
  • అనంతపురం: ఏసీబీ అధికారి అవతారం ఎత్తిన కేటుగాడు. ఏసీబీ అధికారి నుంటూ పలువురు నుంచి భారీగా వసూళ్లు. ఇప్పటి వరకు పలువురు అధికారుల నుంచి రూ.27 లక్షలు వసూలు. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు జయకృష్ణ. రూ.2.91 లక్షలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

హీరోగా వినాయక్..బర్త్ డే రోజునే ఫస్ట్ క్లాప్!

director v v vinayak as hero, హీరోగా వినాయక్..బర్త్ డే రోజునే ఫస్ట్ క్లాప్!

మాస్‌లో మంచి బేసున్న డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. తాజాగా ఈ  మూవీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

దర్శకుడు వీవీ వినాయక్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 9న! అదే రోజున ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. పుట్టినరోజుకు తోడు విజయదశమి పండుగ ఘడియలు కూడా కలిసి వస్తుండటంతో కొబ్బరికాయ కొట్టనున్నారు. భారీ తమిళ చిత్రాల దర్శకుడు శంకర్‌ శిష్యుడు ఎన్‌. నరసింహారావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో రూపొందుతోంది. ఇందులో పాత్ర కోసం వీవీ వినాయక్‌ ఇప్పటికే చాలా వెయిట్ తగ్గారు. లుక్ కూడా పూర్తిగా ఛేంజ్ చేశారు. 1980 నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం.

ఈ వయసులో వినాయక్ హీరో ఏమిటి అని ప్రేక్షకుల్లో ఓ ప్రశ్న తలెత్తే అవకాశముంది. అయితే, ఈ సినిమా కథ నడి వయస్సు వ్యక్తికి సంబంధించినదేనట. ఈ పాత్రకు వినాయక్ అయితే కరెక్ట్‌గా సరిపోతారని దర్శక, నిర్మాతలు ఆయన్ని ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. వినాయక్‌కు కూడా నటన కొత్తేమీకాదు. ‘ఠాగూర్’లో ఆయన చేసిన చిన్న పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది. ఆయనలో మంచి నటుడు ఉన్నాడని ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెబుతుంటారు. మొత్తానికి ప్రస్తుతం దర్శకుడిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినాయక్.. నటుడిగా రాణిస్తారోమో చూడాలి.

తెలుగు సినిమాలకు సంబంధించి గతంలో చాలా మంది హీరోలు దర్శకులుగా మారారు. అలాగే దర్శకులు కూడా కొన్ని సినిమాల్లో తెర మీద కనిపించడం జరిగింది. ఇప్పుడు ఇలాంటిదే వివి వినాయక్ విషయంలో జరగబోతోంది. వినాయక్ 2002లో జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆది’ సినిమాతో దర్శకుడిగా మారి..సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితోనూ పనిచేసి తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ‘అఖిల్’ వంటి భారీ డిజాస్టర్ తరవాత కూడా చిరంజీవి పిలిచి ‘ఖైదీ నెంబర్ 150’ బాధ్యతలు అప్పగించారంటే వినాయక్ స్టామినా ఏమిటో అర్థమవుతుంది. అయితే గత కొంత కాలం నుండి వినాయక్‌కు వరుసగా డిజాస్టర్స్ వస్తున్నాయి. దానికి తోడు సినిమా అవకాశాలు మందగించాయి. దీంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఇంతకుముందు వినాయక్, దిల్ రాజు కాంబినేషల్‌లో నితిన్ హీరోగా ‘దిల్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. దీంతో అప్పటివరకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న దిల్ రాజు ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి దిల్ రాజుగా ప్రస్తుతం తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. అయితే దిల్ రాజు దగ్గరకు వచ్చిన కథల్లో ఓ కథ వినాయక్‌కు బాగా సూట్ అవ్వుద్దని భావించి ఆయనకు కథ వినిపించారు. ఆ స్టోరీ లైన్‌కు వినాయక్ కూడా ఎగ్జైట్ అవ్వడంతో సినిమా పట్టాలెక్కింది. దిల్ రాజుకు నిర్మాతగా వినాయక్ లైఫ్ ఇస్తే..మళ్లీ ఇప్పుడు దిల్ రాజు హీరోగా వినాయక్‌‌కు పునర్జన్మను ఇవ్వబోతున్నారు. సో ఈ క్రేజీ కాంబో ఎలా ఉంటుందో..లెట్స్ వెయిట్ అండ్ సీ.