ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న రెండవ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. మావో ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం నాలుగు గంటలకే ముగియగా.. మిగతా అన్ని ప్రాంతాలలో ఐదు గంటలకు ముగిసింది. కాగా తమిళనాడులో 37 లోక్ సభ నియోజకవర్గాలలో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఇక మధురైలో మాత్రం మీనాక్షి అమ్మవారికి సంబంధించిన వసంతోత్సవాలు జరుగుతుండటంతో.. ఇక్కడ ఎన్నికలు రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతాయని […]

ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2019 | 6:25 PM

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న రెండవ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. మావో ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం నాలుగు గంటలకే ముగియగా.. మిగతా అన్ని ప్రాంతాలలో ఐదు గంటలకు ముగిసింది. కాగా తమిళనాడులో 37 లోక్ సభ నియోజకవర్గాలలో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఇక మధురైలో మాత్రం మీనాక్షి అమ్మవారికి సంబంధించిన వసంతోత్సవాలు జరుగుతుండటంతో.. ఇక్కడ ఎన్నికలు రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతాయని ఈసీ వెల్లడించింది. ఈ విడత పోలింగ్‌లో మొత్తం 95 లోక్ సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు తొలి విడతలో 91 , రెండవ విడతలో 95 స్థానాలకు పోలింగ్ జరిగింది.