వారికి వ్యతిరేకంగా ఓటేయండి: విద్యావంతుల అభ్యర్థన

రాబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విఙ్ఞానవేత్తలు. రానున్న ఎన్నికలు చాలా కీలకమని ఉద్ఘాటించిన వారు.. ‘‘మతం, ప్రాంతం, కులం, లింగం, భాష పేరిట ప్రజలను చిన్నచూపు చూసే వారిని.. ఇబ్బంది పెట్టేవారిని.. దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేవారిని తిరస్కరించండి’’ అంటూ అన్నారు. ఈ మేరకు 154మందితో కూడిన విద్యావంతుల బృందం బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. వారిలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ […]

వారికి వ్యతిరేకంగా ఓటేయండి: విద్యావంతుల అభ్యర్థన
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 6:37 PM

రాబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విఙ్ఞానవేత్తలు. రానున్న ఎన్నికలు చాలా కీలకమని ఉద్ఘాటించిన వారు.. ‘‘మతం, ప్రాంతం, కులం, లింగం, భాష పేరిట ప్రజలను చిన్నచూపు చూసే వారిని.. ఇబ్బంది పెట్టేవారిని.. దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేవారిని తిరస్కరించండి’’ అంటూ అన్నారు. ఈ మేరకు 154మందితో కూడిన విద్యావంతుల బృందం బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

వారిలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్’, ‘ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్’, ‘అశోక యూనివర్సిటీ’, ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విఙ్ఙానవేత్తలు ఉన్నారు. వీరందరూ మాట్లాడుతూ.. ‘‘అసమానత, బెదిరింపులు, వివక్షకు వ్యతిరేకంగా ఓటు వేయండి’’ అంటూ పిలుపునిచ్చారు.

విద్యావంతులను జైలుకు పంపడం, వారిని బెదిరించడం, చంపడం లాంటివి భవిష్యత్‌లో మనదేశంలో పునరావృతం కాకూడదంటూ వారు కోరుకున్నారు. అయితే భారత సాంస్కృతిక సమాఖ్యకు చెందిన కొందరు ‘ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయండి’ అంటూ లేఖ రాసిన విషయం తెలిసిందే. మార్చి 29న 103మంది ఫిల్మ్ మేకర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయండి అంటూ అందులో పేర్కొన్నారు. వారు లేఖ రాసిన కొద్ది రోజులకే విద్యావంతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.