రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మరో నిర్ణయం.. వాలంటీర్లకు ప్లెసిబో వ్యాక్సిన్‌ కీలక ప్రకటన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. తొలి టీకా అభివృద్ది చేశామని చెప్పుకున్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వి తయారి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మరో నిర్ణయం.. వాలంటీర్లకు ప్లెసిబో వ్యాక్సిన్‌ కీలక ప్రకటన
Follow us

|

Updated on: Dec 24, 2020 | 1:09 AM

placebos vaccine: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. తొలి టీకా అభివృద్ది చేశామని చెప్పుకున్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వి తయారి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ల్లో పాల్గొన్న తమ వాలంటీర్లకు ఇక నుంచి ప్లెసిబో వ్యాక్సిన్‌ ఇవ్వమని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్లెసిబో ఇవ్వడం అంత మంచిది కాదని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గిన్స్‌బర్గ్‌ మీడియాతో వెల్లడించారు. ఇప్పటికే ప్లెసిబో తీసుకున్నవారిని గుర్తించి.. వారికి అసలైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ ఇస్తామని తెలిపారు. అయితే, ఇందుకు ప్రభుత్వ అనుమతికి సంబంధించి స్పష్టతలేదు.

రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ప్రయోగాలు తుది దశకు చేసుకున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 40వేల వాలంటీర్లను గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ నియమించుకుంది. క్లినికల్ ట్రయల్స్‌ల్లో పాల్గొన్న వారందరికీ కరోనాను ఎదుర్కొనే అసలైన వ్యాక్సిన్‌ను ఇవ్వకుండా.. కొందరికి మాత్రమే ప్రయోగ వ్యాక్సిన్‌ ఇచ్చి, మరికొందరికి ప్లెసిబో ఇంజెక్షన్‌ ఇస్తారు. అయితే, వీరందరు సాధారణంగా తిరగడం వల్ల వారిలో ఎందరికి వైరస్‌ సోకిందనే అంశాన్ని గుర్తిస్తారు. దీంతో వ్యాక్సిన్‌ సమర్థతను అంచనా వేస్తారు. అయితే, ప్లెసిబో తీసుకున్న వారిలో రోజులు గడుస్తున్నా ఇమ్యూనిటీ సామర్థ్యంలో మార్పులు లేవంటూ కొందరు వాలంటీర్లు గమలేయా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ప్రైవేటుగా ఇమ్యూనిటీ టెస్టు చేయించుకొన్న కొందరు వాలంటీర్లు వాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాల్లో పాల్గొంటున్న వాలంటీర్ల నుంచి ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. వీటి నేపథ్యంలోనే స్పుత్నిక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రష్యాలో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ఇప్పటికే అక్కడి నియంత్రణ సంస్థ టీకా పంపిణీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల మందికి రష్యాలో వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. ప్రయోగాల సమాచార విశ్లేషణలో వ్యాక్సిన్‌ 91.4శాతం సమర్థత చూపించిందని అటు శాస్త్రవేత్తలు సైతం ప్రకటించారు.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి