Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • విశాఖ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు లేఖ రాసిన డాక్టర్ సుధాకర్. తనకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్ సుధాకర్ ఆందోళన. మెరుగైన సౌకర్యాలు కలిగిన ఆసుపత్రికి వెళ్ళేందుకు అనుమతించాలని విజ్ఞప్తి.
  • ఢిల్లీ మే 31 వ తేదీ మోడీ మన్ కీ బాత్‌ కార్యక్రమం. మన్ కి బాత్ లో ...లాక్ డౌన్ 5.0 పై ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం. లాక్ డౌన్ 4.0 చివరి రోజు మే 31. పిఎం మోడీ తన ప్రసంగంలో లాక్డౌన్ స్ఫూర్తిని , దేశంలో చాలా ప్రాంతాల్లో మరింత సడలింపులు వంటి వాటి పై మాట్లాడే అవకాశం ఉందంటున్న విశ్వసనీయ వర్గాల సమాచారం.
  • కరోనా నుంచి కోలుకున్న ఒక నెల పసిపాప. ముంబై లోని సియాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు. పసిపాప కి చప్పట్లు కొడుతూ...సెండ్ ఆఫ్ ఇచ్చిన వైద్యులు, సిబ్బంది.
  • సినిమా షూటింగ్ లు, థియేటర్ ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులతో సమావేశమైన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశమైన మంత్రి శ్రీనివాస్ యాదవ్.
  • అమరావతి: మహానాడు.. కరోనా వైరస్ విజృంభణ- వలస కార్మికుల కష్టాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ గల్లా జయదేవ్.. తీర్మానాన్ని బలపరిచిన మాజీ మంత్రి కేఎస్ జవహర్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ 38వ మహానాడు జూమ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించడం చూస్తే కరోనా వైరస్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇకపై కరోనాకు ముందు తర్వాత అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. గ్లోబల్ క్రైసిస్ లో ఇదే పెద్దది. స్పానిష్ ఫ్లూ వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ.
  • టివి9 తో రైల్వే సిపిఆర్ఓ రాకేష్: ఒకటి నుంచి ప్రయాణించే రైళ్లలో నో మాస్క్ .. నో జర్నీ. మాస్క్ లు లేకుండా స్టేషన్లకు రావొద్దు. ఒకటో తేదీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుండి 32 ట్రైన్స్ . ఢిల్లీ ,హౌరా,గుంటూరు ,వైజాగ్,బాంబే, తిరుపతి,తదితర ప్రాంతాలకు నడపనున్న రైళ్లు. ఇప్పటికే అనేక రైళ్లకు రిజర్వేషన్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు . ప్రయాణాల్లో కోవిద్ 19 నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహరించాలి. దశల వారిగా రైళ్ల ను పెంచేందుకే ప్రయత్నిస్తున్నాం . రైల్వే బుకింగ్స్ దగ్గర నుండి రైళ్లు ఎక్కే వరకూ తిరిగి ప్రయాణికులు బయటకి వెళ్లే వరకు పూర్తి స్థాయిలో నిబంధనలు . స్టేషన్ కి వచ్చిన ప్రయాణికుడికి థర్మల్ స్కీనింగ్ చేసిన స్టాంపింగ్ వేసి ఇళ్లకు పంపిస్తాం.

Volunteers in AP: వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..!

Volunteers in Andhra Pradesh, Volunteers in AP: వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..!

YCP MLA comments on Volunteers: ఏపీలోని గ్రామ/ వార్డు వాలంటీర్లపై మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(YSRCP MLA Bala Nagi Reddy) సంచలన ఆరోపణలు చేశారు. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తోన్న గ్రామ వాలంటీర్లు వాటిని నేతలకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని.. డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Volunteers in Andhra Pradesh, Volunteers in AP: వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..!

అయితే ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే చేర్చేందుకు వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) ప్రభుత్వం గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక్కొక్కరి చొప్పున.. మొత్తం 4లక్షల మంది గ్రామ/ వార్డు వాలంటీర్లుగా ఎంపికయ్యారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.5వేల గౌరవ వేతనం కూడా అందిస్తోంది. కానీ కొందరు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పొందే లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి ఆరోపణల క్రమంలోనే కొంతమందిని వాలంటీర్లుగా తప్పించారు కూడా. కానీ ఇప్పుడు వారు వసూలు చేసే డబ్బులు నేతలకు ఇస్తున్నారంటూ సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

Related Tags