అందుబాటులోకి వొడాఫోన్ ఈసిమ్‌..

ఆధునిక ప్రపంచంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. తమ పోస్టుపెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్ ఈసిమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్

అందుబాటులోకి వొడాఫోన్ ఈసిమ్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2020 | 5:34 AM

Vodafone launches eSIM: ఆధునిక ప్రపంచంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. తమ పోస్టుపెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్ ఈసిమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ వంటి యాపిల్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. త్వరలోనే ఈ సదుపాయాన్ని శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్, శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్లకు కూడా విస్తరించనున్నట్టు పేర్కొంది.

వినియోగదారులు సిమ్ కార్డులను మార్చకుండా సాధారణ కాల్స్, సందేశాలను పంపడం, ఇంటర్నెట్‌ను ఉపయోగించడం వంటివి చేసుకోవచ్చు. ఈసిమ్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే ఇంటిగ్రేటెడ్ సిమ్ చిప్. యూజర్ దీనిని యాక్టివేట్ చేసుకుంటే భౌతిక సిమ్‌తో ఇక పని ఉండదు. ఢిల్లీ, ముంబై, గుజరాత్‌లోని వొడాఫోన్ పోస్టుపెయిడ్ ఖాతాదారులు తమ స్మార్ట్‌ఫోన్ల కోసం ‘ఈసిమ్’ను పొందవచ్చు. త్వరలోనే మరిన్ని నగరాల్లోని వినియోగదారులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.