వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన టెలికాం కంపెనీలు..

ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పట్నుంచి ఒక లెక్క. మొబైల్ కంపెనీలు వార్నింగ్ బెల్స్ ఇచ్చేశాయి. త్వరలోనే వినియోగదారులకు భారీగా ఛార్జీలు వడ్డించడానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే జియో ఈ జాబితాలో ముందుంది. ప్రస్తుతం జియో నుంచి జియోకి కాకుండా.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే ప్రతి కాల్‌కు చార్జీలు వడ్డిస్తోంది రిలయన్స్ జియో. ఇప్పటివరకు జియో వల్ల నష్టపోయిన మిగతా టెలికాం కంపెనీలు కూడా ఇప్పుడు కాస్త రిలీఫ్ ఫీలవుతున్నాయి. త్వరలోనే కాల్  ఛార్జీలు పెంచేందుకు ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా డిసైడయ్యాయి. ఆల్ […]

వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన టెలికాం కంపెనీలు..
Follow us

|

Updated on: Nov 19, 2019 | 10:47 AM

ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పట్నుంచి ఒక లెక్క. మొబైల్ కంపెనీలు వార్నింగ్ బెల్స్ ఇచ్చేశాయి. త్వరలోనే వినియోగదారులకు భారీగా ఛార్జీలు వడ్డించడానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే జియో ఈ జాబితాలో ముందుంది. ప్రస్తుతం జియో నుంచి జియోకి కాకుండా.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే ప్రతి కాల్‌కు చార్జీలు వడ్డిస్తోంది రిలయన్స్ జియో. ఇప్పటివరకు జియో వల్ల నష్టపోయిన మిగతా టెలికాం కంపెనీలు కూడా ఇప్పుడు కాస్త రిలీఫ్ ఫీలవుతున్నాయి. త్వరలోనే కాల్  ఛార్జీలు పెంచేందుకు ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా డిసైడయ్యాయి.

ఆల్ ఫ్రీ అంటూ వచ్చిన జియో దెబ్బకు గత మూడేళ్లుగా సైలెన్స్ మెయింటైన్ చేసింది వొడాఫోన్​-ఐడియా. జియో ఇచ్చిన ప్రొద్బలంతో డిసెంబర్ 1వ తేదీ నుంచి  ఈ సంస్థ కాల్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇక ఎయిర్‌టెల్ కూడా తాము త్వరలోనే కాల్ రేట్లను హైక్ చేస్తున్నట్లు ఎనౌన్స్‌ చేసింది. కాగా ప్రస్తుతం అదర్ నెట్‌వర్కులకు చేసే కాల్స్‌కు ప్రతి నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తోంది జియో.