20 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా..ఆందోళనలో తల్లిదండ్రులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్యలో ఇంకా భారీగానే నమోదవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక మంది వైరస్ బారినపడుతున్నారు. విజయనగరంలో ఒకే క్లాస్ విద్యార్థుల్లో 20 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

20 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా..ఆందోళనలో తల్లిదండ్రులు
Follow us

|

Updated on: Oct 04, 2020 | 5:36 PM

ఏపీలో కరోనా కేసుల సంఖ్యలో ఇంకా భారీగానే నమోదవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక మంది వైరస్ బారినపడుతున్నారు. విజయనగరంలో ఒకే క్లాస్ విద్యార్థుల్లో 20 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

విజయనగరం జిల్లా గంట్యాడ జడ్పీ పాఠశాలలో ఇరవై మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత నెల 30న గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో 20 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. అయితే ఉపాధ్యాయుల్లో ఎవరికీ కరోనా సోకలేదని చెప్పారు. విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతులకు విద్యార్థులు హాజరుకావడం వల్లే కరోనా వ్యాప్తించిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కరోనా తగ్గే వరకు పాఠశాలలు తెరవొద్దని గతంలో అనేక సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం స్పందించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఈ అంశంపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కరోనా సోకిన 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ హైస్కూల్లో మొత్తం 108 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని డీఎమ్‌హెచ్‌వోను ఆదేశించినట్లు చెప్పారు. ఒకవేళ కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అయితే ఆన్ లైన్‌లోనే క్లాసులు నిర్వహిస్తున్నామని స్కూల్ హెడ్మాస్టర్ అంటున్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కి వచ్చారని, అలా వచ్చిన విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని అంటున్నారు. స్కూల్ కి వచ్చిన తరువాత కరోనా సోకిందా? లేక లక్షణాలు కనిపించకుండా ఉన్న విద్యార్థులు కరోనాతో స్కూల్ కి వచ్చారా అనే అంశం పై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..