దిగంబర దొంగ ఆట కట్టించిన పోలీసులు

విశాఖ నగరంలో ఇటీవల ఓ దిగంబర దొంగ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.  ఒంటిపై నూలుపోగు లేకుండా నాలుగు ఇళ్లల్లో చోరీ చేసేందుకు ప్రయత్నించి, ఒక ఇంట్లో కొద్దిపాటి నగదును దొంగిలించాడు.

దిగంబర దొంగ ఆట కట్టించిన పోలీసులు
Follow us

|

Updated on: Sep 12, 2020 | 6:09 PM

విశాఖ నగరంలో ఇటీవల ఓ దిగంబర దొంగ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.   ఒంటిపై నూలుపోగు లేకుండా నాలుగు ఇళ్లల్లో చోరీ చేసేందుకు ప్రయత్నించి, ఒక ఇంట్లో కొద్దిపాటి నగదును దొంగిలించాడు. సిటీలో ఎన్నడూ లేని విధంగా, కొత్త తరహాలో జరిగిన ఈ చోరీతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఫోకస్ పెట్టిన పోలీసులు.. దిగంబర దొంగ ఆట కట్టించారు. దొంగను గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల మోహనరావుగా గుర్తించి, అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మోహనరావుకు సహకరిస్తోన్న సతీష్ కుమార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. మోహనరావుపై 60 కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు డీసీపీ ఐస్వర్య రస్తోగి తెలిపారు. మోహనరావు ఒంటిపై దుస్తులు లేకుండా దొంగతనాలకు వెళ్లడానికి గల కారణాన్ని పోలీసులు వివరించారు. దొంగతనం చేసే సమయంలో స్థానికులకు పట్టుబడితే మతిస్తిమితం లేని వ్యక్తిగా జనాలను డైవర్ట్ చేసేందుకు నగ్నంగా వెళ్తాడని వెల్లడించారు. మోహనరావు చోరీ చేస్తాడని… సతీష్ రెక్కీ చేసి ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తాడని పేర్కొన్నారు.

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం