ఎల్జీ పాలిమ‌ర్స్ సెగ‌లు..ఘ‌ట‌న‌లో మ‌రొక‌రు మృతి

క‌రోనా లాక్‌డౌన్ ఆంక్ష‌ల్లో స‌డ‌లింపులు ప్ర‌క‌టించ‌డంతో మే 7న విశాఖ‌లో ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ తిరిగి ప‌నులు మొద‌లుపెట్టింది. ఆ స‌మ‌యంలో స్టైరిన్ విష వాయువు లీక్ కావ‌డంతో..ప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసింది. కొద్ది నిమిషాల్లోనే ...

ఎల్జీ పాలిమ‌ర్స్ సెగ‌లు..ఘ‌ట‌న‌లో మ‌రొక‌రు మృతి
Follow us

|

Updated on: Jun 08, 2020 | 6:20 PM

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ విషాదం వెంటాడుతూనే ఉంది. ఘ‌ట‌న‌లో తాజాగా మ‌రొక‌రు మృత్యువాత‌ప‌డ్డారు. వెంక‌టాపురం గ్రామానికి చెందిన క‌డ‌లి స‌త్య‌నారాయ‌ణ స్టైరీన్ గ్యాస్ లీక్ ప్ర‌మాదంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కేజీహెచ్‌లో చికిత్స అనంత‌రం గ‌త కొద్ది రోజుల క్రిత‌మే డిశ్చార్జి అయ్యారు.  అయితే, ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వ‌చ్చాక మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఇటీవ‌ల ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అంద‌జేశారు. కాగా, రెండు రోజుల క్రిత‌మే తిరిగి ఇంటికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గురై మృతిచెందాడు. దీంతో ఆ క‌టుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది.
క‌రోనా లాక్‌డౌన్ ఆంక్ష‌ల్లో స‌డ‌లింపులు ప్ర‌క‌టించ‌డంతో మే 7న విశాఖ‌లో ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ తిరిగి ప‌నులు మొద‌లుపెట్టింది. ఆ స‌మ‌యంలో స్టైరిన్ విష వాయువు లీక్ కావ‌డంతో..ప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసింది. కొద్ది నిమిషాల్లోనే ఆర్ఆర్ వెంక‌టాపురం స‌హా ప‌లు ప్రాంతాల్లో గాలి విష‌పూరితంగా మారిపోవ‌డంతో… నిద్ర‌లో ఉన్న ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఆ గ్యాస్ కార‌ణంగా క‌ళ్లు, చర్మం మంట‌ల‌తో మెలకువ వ‌చ్చి.. ప్రాణాలు కాపాడుకునేందుకు ప‌రుగులు తీశారు. దీనిపై పోలీసుల‌కు స‌మాచారం అందిన వెంట‌నే స‌హాయ చర్య‌లు చేప‌ట్టారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది క‌లిసి వేగంగా ప్ర‌జ‌ల్ని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. వంద‌లాది మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అందులో కొంత మంది ఆ విష వాయువుల నుంచి త‌ప్పించుకుని దూరంగా ప‌రిగెత్తుతున్న స‌మ‌యంలోనే ఎక్క‌డిక‌క్క‌డ కుప్ప‌కూలి ప్రాణాలు వ‌దిలారు. ఈ ఘ‌ట‌న‌పై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్ఆర్సీ), నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ (ఎన్జీటీ) సుమోటోగా ద‌ర్యాప్తున‌కు స్వీక‌రించాయి.