Doctor Sudhakar Case : డాక్టర్ సుధాకర్ కేసు విచారణపై హైకోర్టు అసంతృప్తి..పర్యవేక్షణాధికారిని నియమించాలని ఆదేశం

విశాఖ జిల్లా నర్సీపట్టణానికి చెందిన డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం..

Doctor Sudhakar Case : డాక్టర్ సుధాకర్ కేసు విచారణపై హైకోర్టు అసంతృప్తి..పర్యవేక్షణాధికారిని నియమించాలని ఆదేశం
Follow us

|

Updated on: Dec 28, 2020 | 7:42 PM

విశాఖ జిల్లా నర్సీపట్టణానికి చెందిన డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం..మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా సీబీఐ తన నివేదిక అందించాలని ఆదేశించింది. పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశాల్లో సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది.

ఈ ఏడాది మే 16న డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్ డాక్టర్లు నిర్ధారించిన తర్వాత మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్ సుధాకర్‌పై ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరుపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాయడంతో సుమోటో పిల్‌గా పరిగణించారు.  సుధాకర్ మానసిక స్థితి బాగోలేదంటూ గవర్నమెంట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించారు.  సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, తన కొడుకును అక్రమంగా అరెస్ట్ చేశారని, కోర్టులో ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి బాయి హైకోర్టును ఆశ్రయించారు.  ఆపైన హైకోర్టు ఆదేశాలతో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి డిశ్ఛార్జి అయిన విషయం తెలిసిందే.

Also Read :

Yerragondapalem jr ntr flex : “ఏపీకి నెక్ట్స్ సీఎం తారక రామారావే”..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫ్లెక్సీ

 Tiruchanur railway station : శ్రీవారి చెంత మరో రైల్వే స్టేషన్.. ‘బి’ క్లాస్ స్టేషన్‌గా‌ తిరుచానూరు..సకల సౌకర్యాలతో భవనం