వీవో ఎస్‌ 1 ప్రత్యేకతలు

Vivo Launches New Mobile, వీవో ఎస్‌ 1 ప్రత్యేకతలు

ఇండియాలో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో మూడవ స్థానంలో ఉన్న వీవో.. ఎస్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో వచ్చిన ఫస్ట్‌ మోడల్‌ ఎస్‌ 1. ఇక్కడ ఎస్‌ అంటే స్టైల్‌. ఇందుకు తగ్గట్లుగానే ఎస్‌ 1 స్టైలిష్‌గా ఉంది. డైమండ్‌ బ్లాక్‌, స్కైలైన్‌ బ్లూ రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర 17,990 రూపాయలు. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌తో పాటు ఫీచర్స్‌ చాలా బాగున్నాయి. డిజైన్‌, డిస్‌ప్లే, విజువల్‌ క్లారిటీ బావుంది. పట్టుకునేందుకు సౌకర్యంగా ఉంది.

6.38అంగుళాల ఎఫ్‌హెచ్‌డి+సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
1080 X 2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, HD క్లారిటీ
4GB రామ్‌/ 128GB స్టోరేజ్‌, 6GB రామ్‌/64GB స్టోరేజ్‌, 6 GB రామ్‌/128GB స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ లభిస్తుంది.
అదనపు మెమరీ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ఉంటుంది.
బ్యాక్‌లో 16MP, 8MP, 2MP ట్రిపుల్‌ సెటప్‌ కెమెరా ఉంటుంది.
32మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
డ్యూయల్‌ సిమ్‌ సెట్టింగ్‌
మొదటిసారి మీడియాటెక్‌ హెలియో పి 65 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ 9 పై ఆధారంగా ఫన్‌ టచ్‌ ఓఎస్‌ 9
ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌లో చాలా స్పీడ్‌ ఉంది.
అల్ట్రా గేమ్‌ మోడ్‌తో వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *