Breaking News
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌. జిల్లాలోని 9 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌. జనగాం, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌.. వర్ధన్నపేట, డోర్నకల్‌, తొర్రూర్‌, మరిపెడలో టీఆర్‌ఎస్‌ విజయం. జనగాం: టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, ఇతరులు-3. భూపాలపల్లి: టీఆర్‌ఎస్‌-23, బీజేపీ-1, ఇతరులు-6. పరకాల: టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-3, కాంగ్రెస్‌-1, ఇతరులు-1. నర్సంపేట: టీఆర్‌ఎస్‌-16, కాంగ్రెస్‌-6, ఇతరులు-2. తొర్రూరు: టీఆర్‌ఎస్‌-12, కాంగ్రెస్‌-3, బీజేపీ-1. వర్ధన్నపేట: టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-2, బీజేపీ-1, ఇతరులు-1. డోర్నకల్‌: టీఆర్‌ఎస్‌-11, కాంగ్రెస్‌-1, ఇతరులు-3. మహబూబాబాద్‌: టీఆర్ఎస్‌-19, కాంగ్రెస్‌-10, ఇతరులు-7. మరిపెడ: టీఆర్‌ఎస్‌-15.
  • రైతులపై దాడి చేయించిన జగన్‌ రైతు ద్రోహిగా మరింత దిగజారారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవని.. ప్రజలకు అర్థమైందన్న ఆందోళన జగన్‌ను వెంటాడుతోంది-లోకేష్‌. వైసీపీ రౌడీలను రంగంలోకి దింపి జేఏసీ శిబిరానికి నిప్పంటించారు. తెనాలిలో వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-నారా లోకేష్‌. జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌.
  • చిత్తూరు: గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా కుప్పం గ్రామ పంచాయతీ. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం. ఏడు గ్రామపంచాయతీలను కుప్పం మున్సిపాలిటీలో విలీనం. కుప్పం మున్సిపాలిటీలో చీలేపల్లి, దళవాయి కొత్తపల్లి, చీమనాయనపల్లి.. సామగుట్టపల్లి, తంబిగానిపల్లి, కమతమూరు, అనిమిగానిపల్లి విలీనం. చంద్రబాబు నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా కల్పించిన ప్రభుత్వం.
  • కరీంనగర్‌: తిమ్మాపూర్‌ దగ్గర ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు బోల్తా. కారులో ఉన్న దంపతులు మృతి. మృతులు సుల్తానాబాద్‌ వాసులుగా గుర్తింపు.
  • విశాఖ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హై అలర్ట్. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు భద్రత పెంపు.

వివాదాస్పదంగా మారిన వివేక్ ఒబెరాయ్ ట్వీట్

Vivek Oberoi shares meme about Aishwarya-Abhishek, వివాదాస్పదంగా మారిన వివేక్ ఒబెరాయ్ ట్వీట్

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ మ‌ధ్య సినిమాల కంటే రాజ‌కీయాల్లో చాలా చురుకుగా ఉన్న ఆయన.. బీజేపీ పార్టీకే ఆయ‌న మ‌ద్ద‌తుని తెలుపప‌డ‌మే కాకుండా న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌లో మోదీగా న‌టించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు స‌మీపిస్తున్న వేళ వివేక్ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం సృష్టిస్తుంది. ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ మ‌ళ్లీ అధికారంలో వ‌స్తుంద‌ని సూచించాయి.

అయితే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశించి చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఓ వ్యక్తి ఎడిట్ చేసిన ఫోటోను ఒబెరాయ్ ఆయన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌లో వివేక్ ఒబెరాయ్ ఒక‌ప్పుడు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యరాయ్ ప్రేమికుడ‌ని, అంత కంటే ముందు స‌ల్మాన్‌ఖాన్‌తో కూడా ఆమె ప్రేమ‌లో వ్య‌వ‌హారం న‌డిపింద‌ని ఒక‌ప్పుడు మీడియాలో జోరుగా వార్త‌లు వినిపించాయి. కానీ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను ఐశ్వ‌ర్య వివాహం చేసుకుంది. ఇప్పుడు వారికి ఓ పాప కూడా ఉంది. ఈ వ్య‌వ‌హారానికి, ఎన్నిక‌ల‌కు లింక్ పెడుతూ ప‌వ‌న్ సింగ్ అనే వ్య‌క్తి స‌ల్మాన్‌, వివేక్‌, అభిషేక్‌తో ఉన్న ఫోటోను క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. దాన్ని వివేక్ ట్విట్ట‌ర్ అకౌంట్ షేర్ చేస్తూ హ హ‌హ‌.. అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు.

దీనిపై ఇప్పుడు ఐశ్వ‌ర్యారాయ్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ట‌చ్ చేయ‌డం ఎందుకు? అంటూ వివేక్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాజ‌కీయంగా చాలా వ్య‌వ‌హారాలు జ‌ర‌గొచ్చు. కానీ ఎవ‌రో చేసిన ఫోటోను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేయ‌డ‌మేంటి? ఇలా చేయ‌డం ద్వారా ఆయ‌నేం చెప్పాల‌నుకున్నారు? అంటూ జాతీయ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే వివేక్ ట్వీట్ పై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. వివాదాస్పదంగా మారిన ట్వీట్‌పై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మరి ఈ వ్యవహారంపై ఇటు వివేక్.. అటు అమితాబ్ ఫ్యామిలీ అండ్ ఐశ్వర్యారాయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.