బీఎస్‌ఎఫ్‌ నూతన డీజీగా వివేక్‌కుమార్‌ జోహ్రి

Vivek Kumar Johri takes charge as BSF Director General, బీఎస్‌ఎఫ్‌ నూతన డీజీగా వివేక్‌కుమార్‌ జోహ్రి

భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) నూతన డీజీగా వివేక్‌కుమార్‌ జోహ్రి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఉన్న బీఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో నూతన డీజీగా జోహ్రి బాధ్యతలు స్వీకరించారు. బీఎస్‌ఎఫ్ ప్రస్తుత డీజీ రజనీకాంత్‌ మిశ్రా నుంచి ఆయన పదవీ బాధ్యతలు అందుకున్నారు. జోహ్రి మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ అధికారి. 1965లో సరిహద్దు భద్రతా దళం ప్రారంభం కాగా, జోహ్రి బీఎస్‌ఎఫ్‌కు 25వ చీఫ్‌ అధికారిగా నియమితులయ్యారు. ఈయన వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ పొందనున్నారు. ఇప్పటి వరకు జోహ్రి విదేశీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ రీసెర్చ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా)లో ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈయన జులై29న కేంద్ర హోంశాఖ ఓఎస్డీగా నియమితులయ్యారు. భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) ప్రస్తుతం 2.6లక్షల మంది జవాన్లతో దేశంలోనే అతిపెద్ద పారా మిలటరీ బలంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *