విటమిన్ ఇ ఆయిల్‌తో ఇన్ని ఉపయోగాలా..అస్స‌లు ఊహించ‌రు..

విటమిన్ ఇ ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వీటినే క్యాప్సూల్స్ ని ఎవియన్ అని కూడా ఈ ఆయిల్‌‌ని అంటే తల నుంచి పాదాల వరకూ వివిధ ప‌ద్దుతుల్లో ఉపయోగించవచ్చు. ముఖం, జుట్టు, గోర్లు యొక్క బెనిఫిట్స్ పొందటానికి మీరు కొన్నింటిని ఎంచుకోవచ్చు. జుట్టు కోసం.. ఆడ‌వాళ్లు అయినా మ‌గవాళ్లు అయినా అందమైన పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. అలా ఉండ‌టం కోసం జుట్టుపై వివిధ ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో లభించే ర‌కార‌కాల […]

విటమిన్ ఇ ఆయిల్‌తో ఇన్ని ఉపయోగాలా..అస్స‌లు ఊహించ‌రు..
Vitamin-E
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 25, 2020 | 5:46 PM

విటమిన్ ఇ ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వీటినే క్యాప్సూల్స్ ని ఎవియన్ అని కూడా ఈ ఆయిల్‌‌ని అంటే తల నుంచి పాదాల వరకూ వివిధ ప‌ద్దుతుల్లో ఉపయోగించవచ్చు. ముఖం, జుట్టు, గోర్లు యొక్క బెనిఫిట్స్ పొందటానికి మీరు కొన్నింటిని ఎంచుకోవచ్చు.

జుట్టు కోసం..

ఆడ‌వాళ్లు అయినా మ‌గవాళ్లు అయినా అందమైన పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. అలా ఉండ‌టం కోసం జుట్టుపై వివిధ ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో లభించే ర‌కార‌కాల కెమిక‌ల్స్ ఉన్న ప్రొడ‌క్ట్స్ వాడే బదులు..విటమిన్ ఇ తో సులభంగా ఇంటి దగ్గరే మృదువైన, మెరిసే జుట్టును పొందొచ్చు. విటమిన్ ఇ క్యాప్సూల్ ఆయిల్‌ని మీరు వాడే హెయిర్ ఆయిల్ తో కలపి..జుట్టుకు రాసుకుని మ‌సాజ్ చేసి.. 2-3 గంటల వరకు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఊహించ‌ని మార్పు క‌నిపిస్తుంది.

గోర్ల అందానికి..

మనలో చాలా మందికి..ముఖ్యంగా ఆడ‌ద‌వారికి గోర్లు పెంచడం అంటే చాలా ఇష్టం. గోర్లు వారి సుకుమార చేతుల‌కి ఎంతో అందాన్ని తీసుకువ‌స్తాయి. అయితే బ‌ట్టలు వాష్ చెయ్య‌డం, వంట చేయడం, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమటం ఇలా వివిధ రకాల పనులు చేస్తూ ఉండ‌టం వ‌ల్ల‌ గోర్లు విరిగిపోవడం, గీతలు పడటం వంటివి జ‌రుగుతాయి. అయితే గోళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయడానికి ఈ క్యాప్స్యూల్స్‌లోని నూనెని వాడితే ఎంతో ప్ర‌యోజ‌నాన్ని చేకూరుస్తాయి. నిద్ర పోవటానికి ముందు ఈ విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ ను గోర్లు, చుట్టూ ఉన్న చర్మానికి చక్కగా మర్దన చేస్తే..తేమ‌ని పొంది గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.

నైట్ టైమ్ ముఖానికి..

చర్మ సౌందర్యానికి ముఖ్యంగా కావాల్సిన వాటిల్లో విటమిన్ ఇ ఒకటి. అందుకే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఇది త‌ప్ప‌కుండా ఉంటుంది. విటమిన్ ఇ చర్మానికి కాంతిని తీసుకువ‌చ్చి, యవ్వనంగా ఉంచడానికి సాయపడుతుంది. విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ చర్మంలో తేమ‌ను కాపాడుతూ ఉంటాయి. నైట్ టైమ్ ముఖానికి రాసుకునే క్రీమ్ లో కొద్దిగా విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేస్తే గ్లో ఖ‌చ్చితంగా ప్ర‌స్పుట‌మ‌వుతుంది.

యాంటీ రింకీల్ క్రీమ్‌గా..

ఒక వయసు వచ్చాక స్కిన్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. ముడతలు, ఫైన్ లైన్స్ వంటి ఎన్నో చర్మ సమస్యలు రావ‌డం ప‌రిపాటి. అయితే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు విటమిన్ ఇ అద్బుతంగా ప‌నిచేస్తుంది. చర్మంపై విటమిన్ ఇ నూనెతో మ‌ర్ద‌న చేస్తే.. స్కిన్ మెరపు సంత‌రించుకుంటుంది. అంతేకాక విటమిన్ ఇ ‌ని ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కలపడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే అనేక మార్పులను ఇది సమర్థంగా నివారించి వ‌య‌సు మీద‌ప‌డ్డా కూడా యవ్వనంగా ఉంచుతుంది.