క్యాన్సర్‌కు మందు ‘సూర్యుడే!

సూర్యరశ్మి నుంచి విడుదలయ్యే ‘విటమిన్ డి’కి క్యాన్సర్ నివారించే శక్తి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగేళ్ల వ్యవధిలో 80వేల మందిపై నిర్వహించిన పరిశోధనల వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ వల్ల చనిపోతారని భావించిన పలువురిని పరీక్షించగా ‘విటమిన్ డి’ వల్ల మరణించే అవకాశాలు 13 శాతానికి తగ్గినట్లు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ తారెక్ హేకల్ చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ అంకాలజీ వార్షిక సదస్సులో మాట్లాడుతూ.. ‘‘ఇకపై క్యాన్సర్ వైద్య నిపుణులు తమ ప్రిస్కిప్షన్‌లో ‘విటమిన్-డి’ను తప్పకుండా రాయాలి. దీనివల్ల రోగులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. సూర్యరశ్మిలోగానీ, విటమిన్-డి ట్యాబ్లెట్ల ద్వారా గానీ వారు మరింత కాలం జీవించే అవకాశాలు ఉంటాయి’’ అని తెలిపారు. ఏదీ ఏమైనా సూర్మరశ్మి సాధారణ ప్రజలకు కూడా ఆరోగ్యకరమైనదే. ముఖ్యంగా ఉదయాన్నే లేచి కాసేపు సూర్యరశ్మిలో నిలుచుంటే విటమిన్-డి లభించడమే కాదు.. ఇతరాత్ర అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *