Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

ఈ కీపర్‌ త్రో చూడండి… ఎంత ఫన్నీగా ఉందో!

Vitality Blast T20: Wicketkeeper hilariously hits bowler Keshav Maharaj while attempting run out, ఈ కీపర్‌ త్రో చూడండి… ఎంత ఫన్నీగా ఉందో!

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నార్త్‌ గ్రూప్స్‌ విటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. డ్యూరమ్‌, యార్క్‌షైర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌ చేశాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ సింగిల్‌కు ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కు తగలకపోయినప్పటికీ ఇద్దరు సింగిల్‌ కోసం పరిగెత్తారు. దీంతో కీపర్‌ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పడిన బంతిని అందుకుని రన్‌ఔట్‌ చేసేందుకు విసిరాడు. దీంతో అది కాస్తా వికెట్లకు తగలకుండా బౌలర్‌ తొడకు గట్టిగా తగిలింది. బౌలర్‌ వెంటనే నొప్పికి తాళలేక రాసుకుంటూ పక్కకు పరిగెత్తాడు. ఈ సంఘటనతో మ్యాచ్‌లో నవ్వులు విరబూశాయి. హాస్యాస్పదంగా ఉన్న ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం చమత్కారంగా కామెంట్లు చేశారు. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.