అరవ ‘టెంపర్’లో అరవై మార్పులు..!

ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని హిందీలో ‘సింబా’ పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అటు తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రిలీజైన తమిళ ‘టెంపర్’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని మేకర్స్ అనుకుంటున్నార‌ట‌. తమిళ రీమేక్‌లో […]

  • Ravi Kiran
  • Publish Date - 5:24 pm, Sun, 26 May 19

ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని హిందీలో ‘సింబా’ పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అటు తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రిలీజైన తమిళ ‘టెంపర్’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని మేకర్స్ అనుకుంటున్నార‌ట‌. తమిళ రీమేక్‌లో చివరి గంటలో వచ్చే సీన్స్ అన్ని మార్పులు చేయడం వల్ల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మ‌ల్కాపురం శివ కుమార్ తెలుగు డ‌బ్బింగ్ రైట్స్ ద‌క్కించుకోగా, జూన్‌లో మూవీ విడుద‌ల చేయ‌నున్నారు.