Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

చదరంగంలో చిచ్చర పిడుగు..ఎనిమిదేళ్లకే రికార్డ్‌

మేధో క్రీడ చదరంగం(చెస్‌)లో భారత క్రీడాకారుల సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది. భారత చెస్ ఎవర్ గ్రీన్ స్టార్ విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించి సంచలనం సృష్టించగా, చిన్నతనం నుంచే శిక్షణ పొందిన కొనేరు హంపి వంటి వారు చెస్‌ క్రీడారంగంలో ఎంతగానో రాణించారు. తాజాగా విశాఖకు చెందిన ఎనిమిదేళ్ల చిచ్చర పిడుగు మీనాక్షి.. మరో ఛాంపియన్ షిప్ను గెలుచుకుని రికార్డు నెలకొల్పింది. ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్ షిప్లో ప్రపంచంలో 15 మంది ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. ఢిల్లీలో జరిగిన వెస్ట్రన్ అసియన్ జూనియర్ అండ్ యూత్ ఛెస్ ఛాంపియన్ షిప్ లో రెండు బండారు, ఒక కాంస్య పతకాలను సాధించింది.
విశాఖకు చెందిన కొలగట్ల అలన మీనాక్షి… చదరంగంలో చిచ్చర పిడుగులా దూసుకెళ్తోంది. మూడో తరగతి చదవుతున్న ఈ చిన్నారి… రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుస్తూ తన విజయప్రస్థానాన్ని పరుగులు పెట్టిస్తోంది. కామన్వెల్త్ చెస్ చాంఫియన్షిప్ పోటీల్లో పాల్గొన్న మీనాక్షి… ఆరో స్థానంలో నిలించిది. గతేడాది శ్రీలంకలో నిర్వహించిన ఆసియన్ స్కూల్ ఆఫ్ ఛాంపియన్షిప్లో నాలుగు పతకాలను సాధించింది. ఒక బంగారు, ఒక వెండి, రెండు కాంస్య పతకాలను దక్కించుకొని రికార్డు నెలకొల్పింది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున పాల్గొన్న 15 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ నెల నాలుగు నుంచి 11 వరకు ఢిల్లీలో జరిగిన వెస్ట్రన్ ఆసియన్ జూనియర్ అండ్ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ లో మీనాను నాలుగు పతకాలు వరించాయి. చిన్నతనంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న మీనాక్షి విజయాల పట్ల తల్లిదండ్రులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు మేధోశక్తితో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్నారు.