ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ..! విజయసాయి రెడ్డి క్లారిటీ ఇదే..

కేబినెట్‌ భేటికి ముందే విశాఖపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటనతో సీఎం జగన్‌ ఉత్తరాంధ్రకు మంచి బహుమానం ఇచ్చారని అన్నారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ప్రకటన తర్వాత..తొలిసారి సీఎం జగన్‌ ఈ నెల 28న విశాఖకు రాబోతున్నారని, కాబట్టి సీఎం కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. తనపై వస్తున్న భూములు, ఆస్తుల ఆరోపణలపై కూడా విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చారు. […]

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ..! విజయసాయి రెడ్డి క్లారిటీ ఇదే..
Follow us

|

Updated on: Dec 26, 2019 | 2:14 PM

కేబినెట్‌ భేటికి ముందే విశాఖపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటనతో సీఎం జగన్‌ ఉత్తరాంధ్రకు మంచి బహుమానం ఇచ్చారని అన్నారు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ప్రకటన తర్వాత..తొలిసారి సీఎం జగన్‌ ఈ నెల 28న విశాఖకు రాబోతున్నారని, కాబట్టి సీఎం కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. తనపై వస్తున్న భూములు, ఆస్తుల ఆరోపణలపై కూడా విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చారు.

ఆస్తుల వివాదాలపై తాను ఏ అధికారికి ఎప్పుడూ ఫోన్ చేయలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.. తన పేరు చెప్పుకుని ఎవరైనా అధికారుల దగ్గరకు వస్తే… వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఇదే విషయాన్ని తాను కలెక్టర్, నగర కమిషనర్‌కు చెప్పానని తెలిపారు. తనకు విశాఖలో ఒక్క ఫ్లాట్ మినహా మరే ఇతర ఆస్తులు లేవని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తనకు ఎలాంటి ఆస్తులతో సంబంధం లేదన్నారు..అలాంటిది తెలిసిన వెంటనే క్రిమినల్‌ కేసు పెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ నెల 28న విశాఖకు రాబోతున్న సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 24 కిలోమీటర్ల మేర సీఎం జగన్‌కు మానవహారంలా స్వాగతం చెబుతామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ స్వాగత కార్యక్రమం ఉంటుందన్నారు. దాదాపు మూడు గంటలపాటు స్వాగత కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు.. రాబోయే రోజుల్లో కార్యక్రమాలు విశాఖ నుంచే మొదలవుతాయని స్పష్టం చేశారు. ఇక రూ. 1290 కోట్ల పనులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.