విశాఖ వైరాలజీ లాబ్ సిబ్బందికి కరోనా..!

దేశ వ్యాప్తం విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో వైద్య సిబ్బంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. కేజీహెచ్‌ వైరాలజీ ల్యాబ్ సిబ్బంది కరోనా సోకినట్లు తెలిపిన అధికారులు.. తాత్కాలికంగా వైరాలజీ ల్యాబొరేటరీని మూసివేశారు.

విశాఖ వైరాలజీ లాబ్ సిబ్బందికి కరోనా..!
Follow us

|

Updated on: Jul 10, 2020 | 1:17 PM

దేశ వ్యాప్తం విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో వైద్య సిబ్బంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. కేజీహెచ్‌ వైరాలజీ ల్యాబ్ సిబ్బంది కరోనా సోకినట్లు తెలిపిన అధికారులు.. తాత్కాలికంగా వైరాలజీ ల్యాబొరేటరీని మూసివేశారు. ఇక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లలో నలుగురికి కరోనా సోకింది. మార్చి 20 నుంచి టెక్నీషియన్లు, వైద్యులు, ఇతర సిబ్బంది కలిపి 20 మంది వరకు ల్యాబ్‌లో సేవలందిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలకు సంబంధించిన కొవిడ్ నమూనాలను ఇక్కడ పరీక్షలు నిర్వహించేవారు. రెండు నెలల నుంచి విశాఖ జిల్లాకు చెందిన నమూనాలను మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ముగ్గురికి, గురువారం ఒకరికి…ఇలా మొత్తంగా నలుగురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో లాబ్ లో గత రెండు రోజులుగా కొవిడ్ పరీక్షలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ల్యాబ్‌ను గురువారం మూసివేసి పూర్తిస్థాయిలో శానిటైజ్‌ నిర్వహించేందుకు శుక్రవారం మూసివేయనున్నట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. ఇక్కడ పరీక్షలు చేయకున్నా మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎ.పి. ఎయిడ్స్‌ కంట్రోలు విభాగ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నామన్నారు. విశాఖ ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చే వరకు అక్కడే కరోనా పరీక్షలు చేస్తామన్నారు.