భక్తులతో సందడిగా మారిన విశాఖ సముద్రతీరం

పవిత్ర మాఘపౌర్ణమి సందర్భంగా విశాఖ జిల్లాలో సముద్రతీరం భక్తులతో సందడిగా మారింది. సముద్ర స్నానాలు ఆచారించారు భక్తులు. అనంతరం బీచ్ ల వద్ద సూర్యనమస్కారాలతో పాటు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కేబీచ్, రేవు పోలవరం బీచ్లకు జనం ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. రేవు పోలవరంకు వచ్చిన భక్తులు సముద్రస్నానం చేసి, కొండపై వెలసిన వేణుగోపాలస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మాఘపౌర్ణమి రోజున సముద్ర స్నాలు ఆచరించి పూజలు చేయడం వల్ల మంచి జరుతుందనేది భక్తుల నమ్మకం. దూర […]

భక్తులతో సందడిగా మారిన విశాఖ సముద్రతీరం
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2019 | 8:19 AM

పవిత్ర మాఘపౌర్ణమి సందర్భంగా విశాఖ జిల్లాలో సముద్రతీరం భక్తులతో సందడిగా మారింది. సముద్ర స్నానాలు ఆచారించారు భక్తులు. అనంతరం బీచ్ ల వద్ద సూర్యనమస్కారాలతో పాటు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కేబీచ్, రేవు పోలవరం బీచ్లకు జనం ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. రేవు పోలవరంకు వచ్చిన భక్తులు సముద్రస్నానం చేసి, కొండపై వెలసిన వేణుగోపాలస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మాఘపౌర్ణమి రోజున సముద్ర స్నాలు ఆచరించి పూజలు చేయడం వల్ల మంచి జరుతుందనేది భక్తుల నమ్మకం. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.