టిక్‌టాక్ ఎఫెక్ట్: విశాఖ శక్తి టీం రద్దు!

Visakha CP Meena Serious on Shakti Team, టిక్‌టాక్ ఎఫెక్ట్: విశాఖ శక్తి టీం రద్దు!

విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు రక్షణకు ఏర్పాటు చేసిన శక్తి టీమ్‌లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  శక్తి బృందంలోని ఇద్దరు సభ్యులు ఇటీవల విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే టిక్‌టాక్‌ వీడియో చేసి వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకోవడం, అది వైరల్‌ కావడం తెలిసిందే. దీనిపై పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

ఇందుకు బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిచి హెచ్చరించడంతో పాటు మెమోలు కూడా జారీ చేశారు. అకస్మాత్తుగా శక్తి టీమ్‌లోని 35 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులను తిరిగి వారి వారి పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.  ఇప్పుడున్న పోలీస్ కానిస్టేబుల్స్‌కు ఈ శిక్షణ సరిపోదని వారికి మరింత శిక్షణ ఇచ్చి పోలీస్‌ స్టేషన్‌లోని విధులపై అవగాహన ఏర్పడిన తర్వాత తిరిగి బృందాలను ప్రారంభిస్తామని విశాఖ నగర పోలీస్ కమీషనర్ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపారు. సరైన పర్యవేక్షణ లేక పోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని మరలా ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా మంచి శిక్షణ తరువాత శక్తి టీమ్‌ను లాంఛ్ చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *