మనిషి జీవితాలను శాసిస్తున్న వైరస్ లు..

మనిషి జీవితాలను వైరస్‌లు.. శాసిస్తున్నాయి. అర్ధాంతంగా ఆయుష్షును చిదిమేస్తున్నాయి. అనారోగ్యాలు, రోడ్డు ప్రమాదాల వంటి వాటితో చనిపోవడం సాధారణం. ఆ సంఖ్య తీసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ వైరస్‌లు

మనిషి జీవితాలను శాసిస్తున్న వైరస్ లు..
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 3:38 PM

మనిషి జీవితాలను వైరస్‌లు.. శాసిస్తున్నాయి. అర్ధాంతంగా ఆయుష్షును చిదిమేస్తున్నాయి. అనారోగ్యాలు, రోడ్డు ప్రమాదాల వంటి వాటితో చనిపోవడం సాధారణం. ఆ సంఖ్య తీసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ వైరస్‌లు వచ్చిన సమయంలో చూస్తే లక్షల్లోనే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. వైరస్‌లు వస్తూ వస్తూనే మనుషులను అంపశయ్యపై పడుకోబెట్టమే కాదు.. మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఇవి ఈనాటివి కావు. మొట్టమొదటి వచ్చిన వైరస్‌ ఆంటోనిస్‌ ప్లేగు. అప్పుడు ఆ వ్యాధి బారిన పడి 50 లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత క్రీస్తుశకం 541 కాలంలో జస్టీనియన్‌ ప్లేగు వ్యాధితో సుమారు 5 కోట్ల మంది మృతిచెందారు.

ఆ తర్వాత బ్లాక్‌డెత్‌గా బుబోనిక్‌ ప్లేగు నిలిచింది. 1347-1351 కాలంలో వచ్చిన ఈ మహమ్మారి కారణంగా వాల్డ్‌వైడ్‌గా ఏకంగా 20 కోట్ల మంది చావును చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాటిలో మశూచి ఒకటి. దీని బారిన పడి 5 కోట్ల మంది మృతిచెందారు. 1800 సంవత్సరం చివరి టైంలో వచ్చిన ఎల్లోఫీవర్‌ బారిన పడి 10 నుంచి 15 కోట్ల మంది మృత్యువాత పడినట్టుగా అప్పటి లెక్కలు చెబుతున్నాయి. స్పానిష్‌ ఫ్లూ, సార్స్‌, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, స్వైన్‌ఫ్లూ, మెర్స్‌, సార్స్‌ వంటి వ్యాధులు కూడా విజృంభించాయి. అంటువ్యాధుల్లో ఎయిడ్స్‌, హెచ్‌ఐవీ కూడా ఉన్నాయి. 1981 నుంచి దీని బారిన పడి 3కోట్లమందికిపైగా చనిపోయారు.

ఇక రీసెంట్‌గా వచ్చిన ఎబోలా, కోవిడ్‌ 19లు నిలిచాయి. అయితే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 రకాల భయంకరమైన వైరస్‌లు ప్రజలను పీల్చిపిప్పిచేశాయి. కోట్లాది మంది చనిపోవడానికి కారణంగా మారాయి. 17వ శతాబ్ధంలో ఎలుకల ద్వారా వ్యాపించిన ప్లేగు వ్యాధి కారణంగా దాదాపు 3లక్షల మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. 1855లో వ్యాప్తి చెందిన దా థార్డ్ ప్లేగ్‌ వైరస్‌తో కోటీ20 లక్షల మంది మృత్యువాతపడ్డారు.

పందుల ద్వారా సంక్రమించే స్వైన్‌ ప్లూ వ్యాధి 2009లో వెలుగులోకి వచ్చింది. హెచ్‌1ఎన్‌1 అనే వైరస్‌ కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 2లక్షల మందికి పైగా మృతి చెందారు. 2002లో సార్స్‌ వ్యాధి రాగా.. 2012లో మార్స్‌ వ్యాధి వెలుగుచూసింది. 2014లో ఎబోలా వైరస్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ 19 వాల్డ్‌వైడ్‌గా అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే దీని బారిన పడి..2 లక్షల 18వేల మందికిపైగా చనిపోయారు. 200 దేశాల్లో దీని ప్రభావం ఉండగా.. 31 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు.