సెహ్వాగ్ కెరీర్‌ను మలుపుతిప్పిన అరుణ్ జైట్లీ!

Virender Sehwag Recalls Arun Jaitley’s Contribution In His Career, సెహ్వాగ్ కెరీర్‌ను మలుపుతిప్పిన అరుణ్ జైట్లీ!

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. దేశంలోనే ప్రముఖ రాజకీయనాయకుడిగా, న్యాయవాదిగా ఆయన అందరికీ సుపరిచితుడు. అయితే, ఆయన ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1999 నుంచి 2013 వరకు అరుణ్ జైట్లీ డీడీసీఏ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. ఆ సమయంలో ఎందరో ప్రతిభ ఉన్న ఢిల్లీ క్రికెట్ ప్లేయర్లకు భారత జట్టులో స్థానం దక్కేలా చూడగలిగారు. అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడికాక ముందు టీమిండియాలో ఢిల్లీ నుంచి ప్లేయర్లు తక్కువ శాతం ఉండేవారు. అయితే, జైట్లీ వచ్చాక మొత్తం మారిపోయింది. సెహ్వాగ్ లాంటి ప్రతిభ కలిగిన ఎందరికో భారతజట్టులో స్థానం దక్కేలా కృషి చేశారు. తాను భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించడంలో అరుణ్ జైట్లీ కీలక పాత్ర పోషించారని సాక్షాత్తూ సెహ్వాగ్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *