Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

కోహ్లీ ఖాతాలో మరిన్ని రికార్డులు..ఈసారి ఏంటంటే..?

ప్రపంచ క్రికెట్లో మిస్టర్ దూకుడుగా పేరొందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో రికార్డుల పంట పండుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ మరో మూడు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈసారి ఏకంగా క్రికెట్ దేవునిగా యావత్ ప్రపంచం పిలుచుకునే కంగారూ కింగ్ డాన్ బ్రాడ్ మన్ రికార్డును ఛేదించాడు టీమిండియా కెప్టెన్. బ్రాడ్ మన్ తన టెస్టు క్రికెట్ కెరీర్లో మొత్తం ఎనిమిది సార్లు 150కి పైగా పరుగులు చేయగా.. శుక్రవారం పుణె టెస్టులో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో విరాట్ కొహ్లీ ఏకంగా తొమ్మిది సార్లు 150కి పైగా పరుగులు చేసి, డాన్ బ్రాడ్ మన్ రికార్డును తిరగరాశాడు.

అదే క్రమంలో ఏడుసార్లు డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అదే క్రమంలో ఈ టెస్టులో 254 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు టీమిండియా కెప్టెన్. ఈ రెండు రికార్డులే కాకుండా.. మరో రెండు రికార్డులను అధిగమించాడు కొహ్లీ.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 40 సెంచ‌రీలు చేసిన భార‌తీయ కెప్టెన్ గా నిలిచాడు. ద‌క్షిణాఫ్రికాతో పుణెలో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 26వ సెంచ‌రీ కావ‌డం విశేషం. అయితే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచ‌రీల సంఖ్య మొత్తం 69కి చేరుకున్న‌ది. ఇండియా పిచ్‌ల‌పై కోహ్లీకి ఇది 12వ టెస్టు సెంచ‌రీ. అయితే కెప్టెన్‌గా కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 40 సెంచ‌రీలు చేశాడు.

మొద‌టి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. కెప్టెన్‌గా పాంటింగ్ 41 సెంచ‌రీలు చేశాడు. గ‌త ప‌ది టెస్టు ఇన్నింగ్స్‌ల్లో స్వ‌ల్ప స్కోర్ల‌కే ఔటైన విరాట్ కోహ్లీ.. పుణె పిచ్‌పై మాత్రం చెల‌రేగాడు. డ‌బుల్ సెంచ‌రీ దిశ‌గా కోహ్లీ ఇన్నింగ్స్ వెళ్తోంది. తొలుత అజింక్య రహానే, ఆ తర్వాత రవీంద్ర జడేజాల సహకారంతో ఇన్నింగ్స్ను బిల్డప్ చేసిన కొహ్లీ… ఈ టెస్టులో ద్విశతకం సాధించడం ద్వారా మరో ఫీట్ చేజిక్కించుకున్నాడు. కెప్టెన్ హోదాలో డబుల్ సెంచరీ చేసిన విరాట్ కొహ్లీ… కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఈ ఫీట్ సాధించిన బ్రియన్ లారా, గ్రేమ్ స్మిత్ ల సరసన నిలిచాడు విరాట్ కొహ్లీ.