‘విరాటపర్వం’లో బాలీవుడ్ నటి.?

Virata Parvam 1992: Will Nandita Das replace Tabu in Rana Daggubati's film?

దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె పాత్ర కోసం బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నందిత దాస్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దర్శకుడు వేణు ఉడుగుల రూపొందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *