కోహ్లీ ఈజీగా 75-80 సెంచరీలు సాధిస్తాడు!

Virat Kohli Will Score "75-80 ODI Centuries" For India, Predicts Wasim Jaffer

టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీపై మాజీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ ప్రశంసలు జల్లు కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. దాదాపు 11 ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ శతకం నమోదు చేశాడు. దీనిపై జాఫర్ స్పందిస్తూ.. కోహ్లీ ఐదు నెలల అనంతరం తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ చూస్తుంటే.. వన్డేల్లో సులువుగా 75-80 శతకాలు నమోదు చేస్తాడని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా తన అంచనా తప్పక నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ బ్యాటింగ్ కన్స‌ల్టెంట్‌గా సేవలు అందిస్తున్న జాఫర్.. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1944 పరుగులు సాధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *