కోహ్లీ ఇంటినుండి ముంబై అందాలు!

ముంబయిలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న ఓంకార్ 1973 ప్రాజెక్టు పేరిట ఉంటే 70 అంతస్థుల లగ్జరీ అపార్ట్ మెంట్లో 35వ అంతస్థులోనుండి కోహ్లీ ముంబై అందాలను కనువిందుచేశారు. రూ.34 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్… సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్లాటులో ఒక్కో గది వైశాల్యం 7171 చదరపు అడుగులు ఉంటుందని చెబుతున్నారు. వీరింట్లో స్విమ్మింగ్ పూల్ తోపాటు పెంపుడు జంతువులకు స్నానం […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:40 am, Sun, 28 July 19

ముంబయిలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న ఓంకార్ 1973 ప్రాజెక్టు పేరిట ఉంటే 70 అంతస్థుల లగ్జరీ అపార్ట్ మెంట్లో 35వ అంతస్థులోనుండి కోహ్లీ ముంబై అందాలను కనువిందుచేశారు.

రూ.34 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్… సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్లాటులో ఒక్కో గది వైశాల్యం 7171 చదరపు అడుగులు ఉంటుందని చెబుతున్నారు. వీరింట్లో స్విమ్మింగ్ పూల్ తోపాటు పెంపుడు జంతువులకు స్నానం చేయించేందుకు ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించారట. ఇండోర్ టెన్నిస్ కోర్టు.. జిమ్ తో పాటు ఇంట్లోనే క్రికెట్ ఆడుకునేందుకు వీలుగా నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు.

నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అపార్ట్ మెంట్ లో బెడ్రూం నుంచి ఆరేబియా సముద్రాన్ని తిలకించొచ్చని చెబుతున్నారు.ఇద్దరు ప్రముఖ సెలబ్రిటీల ఇంట్లో ఈ మాత్రం విశేషాలు ఉండకపోతే ఎలా? ఈ అపార్ట్ మెంట్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులోనే 29వ అంతస్థులో మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆయన సతీమణి ఇద్దరూ కాపురం ఉంటున్నారు.