పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు

India vs West Indies, పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ పొట్టి క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ(19) నెమ్మదిగా ఆడి ఒకే ఒక్క బౌండరీ బాదాడు. భారత కెప్టెన్‌ 11వ ఓవర్‌లో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఫోర్‌ కొట్టి పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక బౌండరీలు (224) సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు శ్రీలంక బ్యాట్స్‌మన్‌ తిలకరత్నే దిల్షాన్‌(223) పేరిట ఈ రికార్డు ఉండేది. తాజాగా కోహ్లీ అతడిని అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్‌ సైతం ఇబ్బంది పడ్డారు. ఆదిలోనే ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌(1) ఔట్‌కాగా రోహిత్‌శర్మ (24;25 బంతుల్లో 2×4, 2×6), విరాట్‌ కోహ్లీ(19; 29 బంతుల్లో 1×4) నెమ్మదిగా ఆడారు. వీరిద్దరూ ఔటయ్యాక భారత్‌ వరసగా వికెట్లు కోల్పోయినా ఆఖర్లో రవీంద్ర జడేజా(10), వాషింగ్టన్‌ సుందర్‌(8) లాంఛనాన్ని పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *