రోహిత్, కోహ్లీ వివాదంపై రవిశాస్త్రి స్పందన!

Virat Kohli-Rohit Sharma Rift Rumours

ప్రపంచకప్ లో టీమిండియా వైఫల్యం తరువాత కెప్టెన్ కోహ్లీ, రోహిత్ ల మధ్య విబేధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అందరి దృష్టిని ఆకర్షించాయి. విబేధాలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు.అసలు ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్ల మధ్య కావాలనే రూమర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డాడు. గత ఐదేళ్లుగా భారత ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకుంటున్నానని, తానైతే ఎవరి మధ్య ఎటువంటి విభేదాలు చూడలేదన్నాడు. కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలు అనేవి ఒక చెత్త వార్తే తప్పితే అంతకంటే ఏమీ లేదన్నాడు. ‘టీమిండియా ఆటగాళ్లంతా ఎలా ఆడాలనే దానిపై దృష్టి పెట్టడమే నేను చూశానన్నారు.రోహిత్‌-కోహ్లిలు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కచ్చితంగా చెప్పగలను రోహిత్‌-కోహ్లిల మధ్య ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదని రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైనా సోషియల్ మీడియాలో వారి మధ్య విబేధాలకు పుల్ స్టాప్ పడతాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *