‘శాస్త్రి-కోహ్లీ’అనుబంధం విడదీయరానిది?: బీసీసీఐ

Virat Kohli, ‘శాస్త్రి-కోహ్లీ’అనుబంధం విడదీయరానిది?: బీసీసీఐ

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, సారథి విరాట్‌ కోహ్లీ మధ్య పెనవేసుకున్న గాఢ అనుబంధాన్ని తెంచేయడం భారత క్రికెట్‌కు అంత మంచిది కాదని బీసీసీఐలోని ఓ అధికారి అంటున్నారు. వచ్చే ఐదేళ్ల ప్రణాళికలను ఇది దెబ్బతీస్తుందని భావిస్తున్నారు.

టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ప్రపంచకప్‌తో ముగిసింది. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే చీఫ్ కోచ్ పదవికి, దక్షిణాఫ్రికా దిగ్గజ ఫీల్డర్ జాంటీరోడ్స్ ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇలా ఉంటే.. మరోవైపు, రవిశాస్త్రిని మార్చేందుకు బీసీసీఐ భయపడుతున్నట్టు తెలుస్తోంది.

అతడిని కనుక తప్పించి కొత్త వారికి పగ్గాలు అప్పగిస్తే జట్టు సమీకరణాలు దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. టీమిండియా సారథి కోహ్లీ-రవిశాస్త్రి మధ్య మంచి బాండింగ్ ఉందని, ఇద్దరూ కలిసి మంచి విజయాలు సాధించారని గుర్తు చేశారు. కాబట్టి రవిశాస్త్రిని కొనసాగించడమే మంచిదని అభిప్రాయపడ్డారు. 2020 టీ20 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్‌ల నాటికి భారత జట్టు బలంగా తయారు కావాలంటే వీరిని కొనసాగించడం తప్ప మరో మార్గం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *