Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీరీస్ కైవసం

Virat Kohli Leads India To ODI Series Win Against West Indies, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీరీస్ కైవసం

టీమిండియా సారథి.. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత్ మూడు వన్డేల సీరీస్‌ను కైవసం చేసుకుంది. వెస్టీండీస్‌తో జరిగిన మూడు వన్డేల సీరీస్‌లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. రెండో మ్యాచ్ భారత్ నెగ్గింది. ఇక చివరి మ్యాచ్‌కు ప్రారంభంలోనే వరుణుడు ఆటంకం కలిగించడంతో.. మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్..35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ 41 బంతుల్లో 72 పరుగులు చేయగా.. లూయిస్‌ 29 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఆరంభాన్నిచ్చారు. దీంతో 35 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ మూడు‌, షమి రెండు వికెట్లు పడగొట్టారు. అయితే డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్దేశించారు.

దీంతో 255 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన భారత్.. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సారథి విరాట్‌ కోహ్లీ 99 బంతుల్లో 114 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా మరోసారి రెచ్చపోయాడు. 41 బంతుల్లో 65 పరుగులు చేశాడు. 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కోహ్లీసేన లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైంది.