కోహ్లీ ‘గోల్డెన్‌ డక్‌’… ఎన్నోసారంటే?

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ‘గోల్డెన్‌ డక్‌’ అయ్యాడు. భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినా ఫాలోఆన్‌ ఇవ్వకుండా టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (4) త్వరగానే ఔట్‌ కాగా.. క్రీజులో నిలిచేందుకు యత్నించిన లోకేశ్‌ రాహుల్‌ (63 బంతుల్లో 6) పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (0).. కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే ఔట్ అయ్యాడు. కీపర్‌ హామిల్టన్‌కు […]

కోహ్లీ 'గోల్డెన్‌ డక్‌'... ఎన్నోసారంటే?
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 5:16 PM

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ‘గోల్డెన్‌ డక్‌’ అయ్యాడు. భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినా ఫాలోఆన్‌ ఇవ్వకుండా టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (4) త్వరగానే ఔట్‌ కాగా.. క్రీజులో నిలిచేందుకు యత్నించిన లోకేశ్‌ రాహుల్‌ (63 బంతుల్లో 6) పెవిలియన్ చేరాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (0).. కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే ఔట్ అయ్యాడు. కీపర్‌ హామిల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. టెస్టుల్లో గోల్డెన్‌ డక్‌ కావడం కోహ్లీకి ఇది నాలుగోసారి. 2011-12లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో తొలిసారి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. 2014లో ఇంగ్లాండ్‌పై , 2018లో ఇంగ్లాండ్‌పైనే గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. తాజాగా వెస్టిండీస్‌పై నాలుగోసారి పెవిలియన్ చేరాడు. అయితే మొత్తం తొమ్మిది సార్లు టెస్టుల్లో కోహ్లీ డకౌట్‌ అయ్యాడు.

కాగా, వెస్టిండీస్‌కు టీమిండియా 468 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు భారత్‌ 168/4 స్కోరు వద్ద సెకండ్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటిన తెలుగు కుర్రాడు హనమ విహారి రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. రహానేతో కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహనే(64), విహారి(53) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విండీస్‌ 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.