ఆరో బౌలర్‌గా విరాట్‌ కోహ్లీ!

2019 ఐసీసీ ప్రపంచకప్‌ నేపథ్యంలో సౌథాంప్టన్‌ చేరుకున్న భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ చెమటోడుస్తున్నారు. ఇప్పటికే బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తాజాగా బౌలింగ్‌పై దృష్టిసారించాడు. గురువారం సాథన చేస్తుండగా బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేస్తూ ఆఫ్‌ కటర్స్‌ని ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేయగా అది నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు భారత జట్టుకు ఆరో బౌలర్‌గా కోహ్లీ పనికొస్తాడని తెగ ట్రోల్ చేస్తున్నారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:24 pm, Fri, 31 May 19

2019 ఐసీసీ ప్రపంచకప్‌ నేపథ్యంలో సౌథాంప్టన్‌ చేరుకున్న భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ చెమటోడుస్తున్నారు. ఇప్పటికే బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తాజాగా బౌలింగ్‌పై దృష్టిసారించాడు. గురువారం సాథన చేస్తుండగా బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేస్తూ ఆఫ్‌ కటర్స్‌ని ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేయగా అది నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు భారత జట్టుకు ఆరో బౌలర్‌గా కోహ్లీ పనికొస్తాడని తెగ ట్రోల్ చేస్తున్నారు.

కాగా కోహ్లీ గతంలోనూ బౌలింగ్‌ చేసి అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. అవసరమైతే అతను బంతి అందుకోవడానికి సైతం సిద్ధంగా ఉంటాడనే విషయం స్పష్టమౌతుంది. ఇప్పటివరకూ 228 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 48సార్లు బౌలింగ్‌ చేశాడు. అందులో నాలుగు వికెట్లు పడగొట్టాడు.