ఐపీఎల్‌లో కోహ్లీ నయా రికార్డు

బెంగళూరు: టీం ఇండియా కెప్టెన్ కోహ్లి ఐపీఎల్‌లో జోరు చూపిస్తున్నాడు. తాజాగా ప్రిమియర్ లీగ్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా కోహ్లీ కన్నా ముందున్నాడు. రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. గురువారం […]

ఐపీఎల్‌లో కోహ్లీ నయా రికార్డు
Follow us

|

Updated on: Mar 29, 2019 | 10:59 AM

బెంగళూరు: టీం ఇండియా కెప్టెన్ కోహ్లి ఐపీఎల్‌లో జోరు చూపిస్తున్నాడు. తాజాగా ప్రిమియర్ లీగ్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా కోహ్లీ కన్నా ముందున్నాడు. రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.

గురువారం ముంబయితో మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఐదు వేల క్లబ్‌కు 46 పరుగుల దూరంలో ఉన్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, హార్దిక్‌ పాండ్య మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరు ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన 181 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సరిగ్గా 46 పరుగులు చేసి 5000 క్లబ్‌లో చేరాడు. వెంటనే బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌తో ఈ సీజన్‌లో ముంబయి తన ఖాతాలో మొదటి విజయం నమోదు చేసుకుంది. బెంగళూరు రెండో ఓటమిని చవిచూసింది.