వావ్ ! ఖరీదైన కారును ఎలా కాల్చేశాడో ! వీడియో చూడాల్సిందే !
రష్యాలో ఓ యూట్యూ బర్ కి తన ఖరీదైన మెర్సిడెస్ కారంటే విపరీతమైన కోపమొచ్చింది. . 2.4 కోట్ల రూపాయల లగ్జరీ కారును ఇష్టంగా కొనడమైతే కొన్నాడు గానీ..అది అతనికి తెచ్చిన కష్టాలు మాత్రం ఇన్నీఅన్నీ కావు.. మాటిమాటికీ అది రిపేర్లకు వెళ్లడంతో అతడిలో సహనం నశించింది. కారును ఏ డీలర్ వద్ద కొన్నాడో గానీ అతగాడు కూడా ఈ వాహనానికి మరమ్మతులు చేయలేక చేతులెత్తేశాడు. మన యూట్యూబర్ గారి ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేశాడు. […]
రష్యాలో ఓ యూట్యూ బర్ కి తన ఖరీదైన మెర్సిడెస్ కారంటే విపరీతమైన కోపమొచ్చింది. . 2.4 కోట్ల రూపాయల లగ్జరీ కారును ఇష్టంగా కొనడమైతే కొన్నాడు గానీ..అది అతనికి తెచ్చిన కష్టాలు మాత్రం ఇన్నీఅన్నీ కావు.. మాటిమాటికీ అది రిపేర్లకు వెళ్లడంతో అతడిలో సహనం నశించింది. కారును ఏ డీలర్ వద్ద కొన్నాడో గానీ అతగాడు కూడా ఈ వాహనానికి మరమ్మతులు చేయలేక చేతులెత్తేశాడు. మన యూట్యూబర్ గారి ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేశాడు. ఇక మనోడు భరించలేక ఈ మెర్సిడెస్ ను నిర్మానుష్యమైన పొలం వద్దకు తీసుకువెళ్లి దానికి అగ్గి రాజేశాడు. అది మంటల్లో మండుతుంటే తాపీగా బ్రెడ్డు ముక్క నములుతూ ఎంజాయ్ చేశాడు. ఆయనగారు తన వాహనాన్ని కాల్చిన విధంబెట్టిదనిన.. ఈ వీడియో చూడాల్సిందే ! అన్నట్టు ఇతని పేరు మైఖేల్ లిట్ విన్ అట !