అయోధ్యలో దొరికిన ‘సంస్కృత లేఖ’..నిజమేనా ?

అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా ఓ రాగి పాత్ర వంటిదానిలో లభ్యమైన 'సంస్కృత లేఖ' తాలూకు వీడియో వైరల్ అయింది. పుష్పేన్ద్ర కులశ్రేష్ఠ అనే పొలిటికల్ కామెంటేటర్ ఒకరు ఈ వీడియోను..

అయోధ్యలో దొరికిన 'సంస్కృత లేఖ'..నిజమేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2020 | 12:26 PM

అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా ఓ రాగి పాత్ర వంటిదానిలో లభ్యమైన ‘సంస్కృత లేఖ’ తాలూకు వీడియో వైరల్ అయింది. పుష్పేన్ద్ర కులశ్రేష్ఠ అనే పొలిటికల్ కామెంటేటర్ ఒకరు ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేయగానే రెండువేల రీట్వీట్లు, తొమ్మిది వేల  లైక్ లు వచ్చాయి. అనేకమంది నెటిజన్లు ఈ వీడియోను ఫేస్ బుక్ వంటి వాటిలో షేర్ చేస్తూ.. ఇది ‘టైమ్ క్యాప్సూల్’ అని, అసలైన రామాలయ వివరాలు ఇందులో ఉన్నాయని చిలవలు, పలవలుగా ఊహాగానాలు చేశారు. ఈ డాక్యుమెంట్ లోని భాష ఖఛ్చితంగా సంస్కృతమే అని కొందరు ‘నిర్ధారించారు’. కానీ రామజన్మభూమి స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు దొరిన వస్తువుల్లో ఎలాంటి లేఖ కనబడలేదని ఆ తరువాత తెలిసింది. అసలు వైరల్ అవుతున్న వీడియోను ఒకరు తన ఇన్ స్థా గ్రామ్ అకౌంట్ లో ‘డిఫైన్ఎల్ సిసి ‘పేరిట షేర్ చేశారని తెలియవచ్చింది. ఈ హాబీయిస్టు పలు అరుదైన, పురాతన వస్తవులు, నాణేలు తదితరాల ఫోటోలను పోస్ట్ చేస్తుంటాడట.. ఇంకా ఈ రాగి వస్తువులోని భాష సంస్కృతం కాదని, ‘హీబ్రో’ అని కూడా తెలిసింది. అంటే యూదులు వాడే భాష అట ! మొత్తానికి అసలు విషయం తెలిసి.. మొదట ఏవేవో ఊహాగానాలు చేసినవాళ్ళంతా తెల్లమొహం వేశారు.