ఆమె చేసిన సేవకు.. గిఫ్ట్‌గా వచ్చిన ఇల్లు..

కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లుకు చెందిన సుప్రియ అనే మహిళ స్థానికంగా జోయ్ ఆలుక్కాస్ అనే సంస్థలో పని చేస్తుంది. గత 10 రోజుల క్రితం సుప్రియ ఓ అంధుడిని బస్సు ఎక్కించి, తన సేవా గుణాన్ని చాటుకున్నందుకు ఆమెను అభినందించేందుకు ఇంటికి..

  • Tv9 Telugu
  • Publish Date - 6:45 pm, Thu, 16 July 20

సరిగ్గా 10 రోజుల క్రితం దేశ వ్యాప్తంగా వైరల్ అయిన ఈ వీడియో మీకు గుర్తుందా? బస్సు వెనకాలే పరిగెత్తి మరీ.. ఓ అంధుడిని బస్సు ఎక్కించింది ఈ మహిళ. ఈమెనే గత పది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతోంది. ఈ వీడియోను తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. ఆమె చేసిన సేవకు నెటిజన్లు కూడా ఫిదా అయి ప్రశంసించారు. ప్రస్తుతం ఈ మహిళ చూసిన ఔదర్యానికి.. ఆమె పని చేసే కంపెనీ ఇల్లును బహుమతిగా ఇచ్చారు.

కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లుకు చెందిన సుప్రియ అనే మహిళ స్థానికంగా జోయ్ ఆలుక్కాస్ అనే సంస్థలో పని చేస్తుంది. గత 10 రోజుల క్రితం సుప్రియ ఓ అంధుడిని బస్సు ఎక్కించి, తన సేవా గుణాన్ని చాటుకున్నందుకు ఆమెను అభినందించేందుకు ఇంటికి వెళ్లారు జోయ్ ఆలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్. చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న సుప్రియను కలిసి అభినందించిన చైర్మన్.. వచ్చేవారం త్రిస్సూర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఛైర్మన్ సూచన మేరకు త్రిస్సూర్‌కు వెళ్లిన సుప్రియను ఆశ్చర్యపరిచేలా ఇల్లును బహుమతిగా ఇచ్చారు జోయ్ ఆలుకాస్ కంపెనీ. అందుకు సుప్రియ ఎంతో సంతోషించింది.

Read More:

కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..