సోష‌ల్ మీడియాలో ‌జపనీస్ జంట హ‌ల్ చ‌ల్..తార‌క్ పాట‌కు అదిరిపోయే స్టెప్పులు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సమీరారెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అశోక్‌’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 2006లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

  • Ram Naramaneni
  • Publish Date - 9:06 am, Sun, 5 July 20

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సమీరారెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అశోక్‌’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 2006లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ మ్యూజికల్‌గా మంచి మార్కులు సంపాదించినా, తార‌క్ అభిమానుల‌ను మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేది ఏముంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘గోల గోల..’ పాటలో ఎన్టీఆర్‌-సమీరారెడ్డిలు పోటీ ప‌డి డ్యాన్స్ చేస్తారు. కెమిస్ట్రీ కూడా అదిరిపోతుంది. ఇక మణిశర్మ సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం క‌ల‌బోసి సాంగ్ ఇంకో రేంజ్ అంతే.

తాజాగా ఈ పాటకు ఓ జపనీస్ క‌పుల్ డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట తెగ హ‌ల్ చల్ చేస్తోంది‌. కాస్టూమ్స్ కూడా సేమ్ దింపేశారు. సేమ్ ఎన్టీఆర్‌-సమీరలు చేసినట్టే డ్యాన్స్‌ చేస్తున్నారని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి.