“షూ’..లో బాటిల్‌ ఓపెనర్‌..!

Viral: These pumps come with in built bottle openers and internet is impressed, “షూ’..లో బాటిల్‌ ఓపెనర్‌..!

మీరు బాటిల్‌ మూత తీసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారా..? సమయానికి బాటిల్‌ ఓపెనర్ అందుబాటులో లేదా…? అయితే, ఇప్పుడది ఈజీనే… కాలి బూట్లతోనే బాటిల్‌ మూతను సునాయసంగా తీయగలిగే అవకావం వచ్చింది. అదేంటీ..కాలి బూట్లతో బాటిల్‌ మూతను ఎలా తీస్తారు ? అని ఆశ్చర్యంగా ఉంది కదా..కానీ, ఇది నిజం..ఇప్పుడు బాటిల్‌ మూతను తీసే వెసులుబాటున్న సరికొత్త బూట్లు అందుబాటులోకి వచ్చాయి. నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నఈ బూట్లకు లక్షల్లో లైకులు, కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..ఈ బూట్లకు అమర్చి ఉన్న ఓపెనర్‌తో బాటిల్‌ మూత తీస్తున్నఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. “పార్టీ పంపులు’గా పిలువుబడే ఈ షూ…మడమ భాగంలో వెండి – టోన్డ్‌ మెటల్‌ ఓపెనర్‌ను అమర్చారు. దాంతో ఈజీగా బాటిల్‌ మూతను తీసేందుకు అవకాశం ఉంది. ఈ బూట్లను చూసిన సెలబ్రిటీ డిజైనర్‌ మార్క్‌ జాకబ్స్ ఇవి తెలివైన ఐడియాగా అభివర్ణించారు. ఇంతకీ ఈ బూట్ల ధర ఎంతో మీకు చెప్పలేదు కదా..వీటి ధర కేవలం 98 వేల 995 రూపాయలు మాత్రమే. అయితే, ఈ లేడీస్‌ షూలో బాటిల్‌ ఓపెనర్‌ అమర్చటంలో మాతలబెంటో మరీ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *